దుత్తలూరు: మండలంలోని దుత్తలూరు–నందిపాడు మార్గంలో గంజాయి పంట సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు అప్రమత్తమై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. సుమారు మూడు ఎకరాల్లో గంజాయి పంట సాగులో ఉన్నట్లు సమాచారం రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పంట ఎక్కడ సాగు చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పంట సాగు, భూమి యజమాన్యం, బాధ్యుల వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
