Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

త్యాగానికి ప్రతిరూపం మోహరం: బీజేపీ మైనారిటి నాయకులు సయ్యద్ మోహినుద్దీన్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
త్యాగానికి ప్రతిరూపం మోహరం: బీజేపీ మైనారిటి నాయకులు సయ్యద్ మోహినుద్దీన్.
Oplus_16908288

ఖమ్మం జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

మోహరం పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ మైనారిటీ నాయకులు సయ్యద్ మోహినుద్దీన్ ఈ సందర్బంగా మాట్లాడుతూ మోహారం నెల అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మరియు అత్యంత పవిత్రమైన నెల అయితే ఇది ఆనందంగా జరుపుకునే పండుగ కాదని అన్నారు మహ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్, కర్బాలా యుద్ధంలో చేసిన త్యాగానికి చిహ్నంగా ఈ మాసాన్ని సంతాప దినంగా, పవిత్రంగా భావిస్తారని అన్నారు,ఇస్లామిక్ నూతన సంవత్సరం ఇస్లామిక్ లూనార్ చంద్ర క్యాలెండర్ ప్రకారం మోహర్రం మొదటి నెల. దీనిని ఇస్లామిక్ నూతన సంవత్సరంగా పరిగణిస్తారని అన్నారు మొహర్రం పదవ రోజున ఆషూరా ఖానాలో కర్బాలా యుద్ధంలో హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులు అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదిరించి ప్రాణత్యాగం చేశారని అన్నారు,తెలుగు రాష్ట్రాల్లో మోహర్రంను ‘పీర్ల పండుగ’ అని పిలుస్తారని అన్నారు,ఈ సమయంలో పంజా పీర్ల ప్రతిమలులను ఊరేగింపుగా తీసుకెళ్తారని,సంతాపం ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ తమ దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ సంతాపం జరుపుకుంటారని,ఈ మాసంలో, ముఖ్యంగా 10వ తేదీన ఆషూరా నాడు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు పాటిస్తారని అన్నారు

త్యాగానికి ప్రతిరూపం మోహరం: బీజేపీ మైనారిటి నాయకులు సయ్యద్ మోహినుద్దీన్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *