Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమల ఫిబ్రవరి 15 పున్నమి ప్రతినిధి

తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
———————
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *