Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గంజాయి తోటను పరిశీలించిన నెల్లూరు ఎస్పీ అజితా వెజెండ్ల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గంజాయి తోటను పరిశీలించిన నెల్లూరు ఎస్పీ అజితా వెజెండ్ల

వార్త ముఖ్యాంశాలు

  • మొక్కజొన్న పంట మాటున గంజాయి సాగు..
  • పోలీసుల దాడులతో వెలుగులోకి!
  • దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో మొక్కజొన్న పంట మాటున సాగుచేస్తున్న గంజాయి తోటను జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల శుక్రవారం ఉదయం పరిశీలించారు.

మొక్కజొన్న పంట మాటున గంజాయి సాగు.. పోలీసుల దాడులతో వెలుగులోకి!
దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో మొక్కజొన్న పంట మాటున సాగుచేస్తున్న గంజాయి తోటను జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా గంజాయి సాగుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది. పంట సాగు వెనుక ఉన్న వ్యక్తులు, ఇతర వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సాగుపై అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *