Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారలా మీద సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారలా మీద సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా, ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు శ్రీ మహీరధన్ గారు జిల్లా పర్యటన కొనసాగిస్తున్నారు.
  • ఈ క్రమంలో, శుక్రవారం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమయ్యారు.
  • ఈ సమావేశంలో, జిల్లాలో పార్టీ కార్యకలాపాల బలోపేతం, శక్తివంతమైన నాయకత్వం ఏర్పాటుపై చర్చ జరిగింది.

పున్నమి ప్రతినిధి

ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా, ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు శ్రీ మహీరధన్ గారు జిల్లా పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో, శుక్రవారం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో, జిల్లాలో పార్టీ కార్యకలాపాల బలోపేతం, శక్తివంతమైన నాయకత్వం ఏర్పాటుపై చర్చ జరిగింది. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ శక్తి, నాయకుల మధ్య సమన్వయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యత వంటి అంశాలపై మహీరధన్ గారు విశ్లేషించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, “ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైన చరిత్ర ఉంది. పాత, కొత్త నాయకుల సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరగాలి” అని పేర్కొన్నారు. అనంతరం, పరిశీలకుడు జిల్లా నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు కుచన రవలి రెడ్డి. పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *