వార్త ముఖ్యాంశాలు
- అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పెనగలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆగస్టు 17న ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు కార్యకర్తల సమస్యలను విని వెంటనే పరిష్కరించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మండలంలో వారానికి రెండు మూడు రోజులు పర్యటిస్తూ కార్యకర్తల సమస్యలను నేరుగా విని సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
- అవసరమైతే కలెక్టర్, మంత్రివర్యులు, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అయినా పరిష్కారం సాధిస్తానని స్పష్టం చేశారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పెనగలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆగస్టు 17న ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు కార్యకర్తల సమస్యలను విని వెంటనే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మండలంలో వారానికి రెండు మూడు రోజులు పర్యటిస్తూ కార్యకర్తల సమస్యలను నేరుగా విని సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే కలెక్టర్, మంత్రివర్యులు, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అయినా పరిష్కారం సాధిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల కృషి వలననే తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేసిన ఆయన, కాబట్టి ఎవ్వరూ అధైర్య పడవద్దని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.