వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్ ఎస్ఐ నవీన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
- వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు.
- ఉచిత రీఛార్జ్, బంపర్ ఆఫర్, బహుమతుల పేర్లతో వచ్చే లింక్స్ పూర్తిగా మోసపూరితమని, వాటి ద్వారా వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు.
చిట్వేల్ ఎస్ఐ నవీన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. ఉచిత రీఛార్జ్, బంపర్ ఆఫర్, బహుమతుల పేర్లతో వచ్చే లింక్స్ పూర్తిగా మోసపూరితమని, వాటి ద్వారా వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి లింక్స్‌ను క్లిక్ చేయడం మాత్రమే కాకుండా ఇతరులకు ఫార్వార్డ్ చేయరాదని కూడా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, సైబర్ మోసగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.