Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఎమర్జెన్సీ చీకటి రోజులపై బీజేపీ నిరసన.. హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులుగా పేర్కొంటూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో…
  • నగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు విధించబడ్డాయని పేర్కొన్నారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజులుగా పేర్కొంటూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు విధించబడ్డాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రుద్ర ప్రదీప్, శ్యాం సుందర్ నాయక్, నాయుడు రాఘవ, గుత్త వెంకటేశ్వర్లు, ఎల్లరావ్ గౌడ్, మంద సరస్వతి, మణి, స్వర్ణ లత, నంబూరు రామలింగేశ్వరావ్, వాళ్ళలా రమేష్,తాజునోతు భద్రం,డీకొండ శ్యాం, సాయి రామ్, మేకల నాగేంద్ర, నకిరి కంటివీర భద్రం, రవి గౌడ్, జ్వాలా నరసింహ రావు, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *