Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం..!

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎస్.
  • రాయవరం: ఎస్.
  • రాయవరం మండలం రేవుపోలవరం జెడ్.పి.హెచ్.ఎస్.

అనకాపల్లి జిల్లా: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్

ఎస్. రాయవరం: ఎస్. రాయవరం మండలం రేవుపోలవరం జెడ్.పి.హెచ్.ఎస్. పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా “ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్” కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పి.డి. మాస్టర్ శ్రీ కృష్ణ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు, ఎకో క్లబ్ ఇన్‌ఛార్జ్ శ్రీ కె. ప్రవీణ్ కుమార్ సమక్షంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థులు పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటి, వాటికి నీరు పోసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు “ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్” సర్టిఫికెట్లను ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా హెచ్.ఎం. అరుణ మాట్లాడుతూ “ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పెంచడం మనందరి కర్తవ్యం” అని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *