Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: ప్రగడ నాగేశ్వరరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: ప్రగడ నాగేశ్వరరావు

వార్త ముఖ్యాంశాలు

  • మునగపాకలో సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని APRDC చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
  • మునగపాక మండల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
  • ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు.

మునగపాకలో సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని APRDC చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మునగపాక మండల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.రాష్ట్ర మాజీ కార్యదర్శి కర్రీ సాయి కృష్ణ మాట్లాడుతూ కార్యకర్తల కష్టమే పార్టీకి అసలైన బలమని, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మునగపాక మండల టీడీపీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *