Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఇంకుడు గుంతలను సద్వినియోగం చేసుకోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇంకుడు గుంతలను సద్వినియోగం చేసుకోవాలి

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నారావుపేట: పాత మగ్దూంపురం గ్రామంలో విబిజి రామ్ జి ఈజిఎస్ ఆ ధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను రైన్‌ హార్వెస్టింగ్‌ గుంతల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ననుమస కర్ణాకర్ సూచించారు.
  • వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు.
  • ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లోని ఇంకుడు గుంతలను పరిశుభ్రంగా ఉంచి, వర్షపు నీరు వాటిలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

చెన్నారావుపేట: పాత మగ్దూంపురం గ్రామంలో విబిజి రామ్ జి ఈజిఎస్ ఆ ధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను రైన్‌ హార్వెస్టింగ్‌ గుంతల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ననుమస కర్ణాకర్ సూచించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లోని ఇంకుడు గుంతలను పరిశుభ్రంగా ఉంచి, వర్షపు నీరు వాటిలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో నీటి కొరతను నివారించేందుకు వర్షపు నీటి సంరక్షణ ఎంతో అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. విబిజి రామ్ జి ఈజిఎస్ ద్వారా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో తమ ఇండ్లలో వాడుకున్న వృధా మురికి నీటిని రోడ్ల పైకి రాకుండా చూసుకోవాలి కోరినారు. విబిజి రామ్ జి ఈజిఎస్ పథకంలో భాగంగా ఇంకుడు గుంతకు 6500 మరియు రైన్ హార్వెస్టింగ్ ఇంకుడు గుంత కు 13000 రూపాయలు పొందగలరని తెలిపినారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ననుమాస కర్ణాకర్, ఉపసర్పంచ్ అలువాలా శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమారి, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు వార్డు సభ్యులు కట్టూరి లక్ష్మణాచారి ఫీల్డ్ అసిస్టెంట్ పోగుల సురేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *