వార్త ముఖ్యాంశాలు
- నర్సంపేట: వరంగల్ రీజియన్ పరిధిలోని నర్సంపేట ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
- ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట డిపో ఎన్‌ఎంయూ (NMU) గౌరవ అధ్యక్షులు వేముల సాంబయ్య గౌడ్, ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.
- మౌలానా గార్లు ఎన్నికల సమయంలో డిపోను సందర్శించారు.
నర్సంపేట: వరంగల్ రీజియన్ పరిధిలోని నర్సంపేట ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట డిపో ఎన్‌ఎంయూ (NMU) గౌరవ అధ్యక్షులు వేముల సాంబయ్య గౌడ్, ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి. మౌలానా గార్లు ఎన్నికల సమయంలో డిపోను సందర్శించారు.
ఈ ఎన్నికల ప్రక్రియలో నర్సంపేట డిపో పరిధిలోని NMU, EU, TMU, TJMU సంఘాలకు చెందిన కార్మికులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పి.ఎన్. రావు, బండి బాబు, గోలకొండ వేణు, రాంబాబులతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దండెం రతన్ కుమార్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, ఎన్ఎస్ యుఐ (NSUI) ప్రెసిడెంట్ కటారి ఉత్తమ్ కుమార్, 29వ డివిజన్ కార్యదర్శి దొమ్మటి కుమారస్వామి, ఉమ్మడి జేఏసీ ఉద్యోగులు మరియు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.