వార్త ముఖ్యాంశాలు
- వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా కమిటీకి నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, స్టేట్ ఎంసీ మెంబర్ నాడెం శాంతి కుమార్, జిల్లా ఎంసీ సభ్యులు మోతే తిరుపతిరెడ్డి, చొప్పరి సోమయ్యలకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
- అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ..
వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా కమిటీకి నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, స్టేట్ ఎంసీ మెంబర్ నాడెం శాంతి కుమార్, జిల్లా ఎంసీ సభ్యులు మోతే తిరుపతిరెడ్డి, చొప్పరి సోమయ్యలకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజాసేవే పరమావధిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు