Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ప్రజా వాణిలో పిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజా వాణిలో పిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రతి సోమవారం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా వాణి కార్యక్రమానికి హాజరైన బోడ మాణిక్యం తండా గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్ గ్రామంలోని పలు సమస్యలను ఎంపీడివో దృష్టికి తీసుకెళ్లారు..సోమవారం రోజున ప్రజావాణిలో నిరుపేద కుటుంబానికి చెందిన చించావత్ విజయ రామ్ దాన్…
  • ఈ విషయమై మండల అభివృద్ధి అధికారి స్పందించి హౌసింగ్ ఏఈ భవ్య గారిని పిలిపించి ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి గారి ద్వారా తక్షణమే విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఆదేశించారు..ఎంపిడివో వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేయడం పట్ల గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్…

ప్రతి సోమవారం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా వాణి కార్యక్రమానికి హాజరైన బోడ మాణిక్యం తండా గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్ గ్రామంలోని పలు సమస్యలను ఎంపీడివో దృష్టికి తీసుకెళ్లారు..సోమవారం రోజున ప్రజావాణిలో నిరుపేద కుటుంబానికి చెందిన చించావత్ విజయ రామ్ దాన్ మరియు భూక్య విజయ వీరేందర్ ఇందిరమ్మ ఇండ్ల విషయములో ఆనాటి పంచాయతీ కార్యదర్శి అధికారుల తప్పిదం వలన కిరాయికి ఉన్న ఇంటి వద్ద ఫోటోలు తీయగా స్లాబులు అని లబ్ధిదారుల పేర్లు సుమారు పదిమందివి L3 లో పడినందున ఈ రోజు ఇద్దరివి ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసినా కూడా సమస్య పరిష్కారం కానందున ఈరోజు గ్రీవెన్స్ లో మండల అభివృద్ధి అధికారి గారికి చించావత్ విజయ రందాన్ ల ప్రస్తుత ఇంటి ఫోటోతో ఈరోజు గ్రీవెన్స్ ద్వారా ఇవ్వడం జరిగినది. ఈ విషయమై మండల అభివృద్ధి అధికారి స్పందించి హౌసింగ్ ఏఈ భవ్య గారిని పిలిపించి ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి గారి ద్వారా తక్షణమే విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఆదేశించారు..ఎంపిడివో వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేయడం పట్ల గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్ బాధితులు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *