వార్త ముఖ్యాంశాలు
- *🟧 అవినీతి ఆరోపణలు నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తా!
- – ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు**🟧 ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదు..
- చట్టపరంగా ఎదుర్కొంటా!**🟧 శివుడి సాక్షిగా ప్రమాణం చేయి గురునాథం..
*🟧 అవినీతి ఆరోపణలు నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తా! – ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు**🟧 ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదు.. చట్టపరంగా ఎదుర్కొంటా!**🟧 శివుడి సాక్షిగా ప్రమాణం చేయి గురునాథం.. చైర్మన్ బాలకృష్ణ నాయుడు సవాల్**🟧 ఆలయ విరాళాల్లో ప్రతి రూపాయికీ లెక్కలు సిద్ధం.. చైర్మన్ స్పష్టీకరణ**🟧 రూ.8.50 లక్షల విరాళాలకు లెక్కలు చూపించాం.. దాతలందరికీ రసీదులు ఇచ్చాం – చైర్మన్**🟧 దాతలు రూ.20 లక్షలు తీసుకెళ్లానన్న ఆరోపణలు అవాస్తవం.. బాలకృష్ణ నాయుడు ఖండన**🟧 లక్ష రూపాయలు ఇవ్వలేదనే నాపై కక్ష సాధింపు.. గురునాథంపై చైర్మన్ ఆరోపణ**🟧 నాగ ప్రతిష్టల వ్యవహారంలో బంగారం, వజ్రాల ఆరోపణలు నిరాధారం.. చైర్మన్**🟧 ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే సహించేది లేదు.. బాలకృష్ణ నాయుడు హెచ్చరిక**🟧 ఆలయ నిధుల వివాదంపై ఘాటుగా స్పందించిన చైర్మన్.. కోర్టుకు వెళ్తానని హెచ్చరిక**———————* *✍🏽వినోద్ కుమార్ 👇🏽* వినోద్ కుమార్ *జర్నలిస్ట్**———————-*గూడూరు పట్టణంలోని శ్రీ శ్రీ స్వయంభు మూలస్థానేశ్వర స్వామి శివాలయం అభివృద్ధి విరాళాలపై పాలకమండలి సభ్యుడు ఎం. గురునాథం చేసిన అవినీతి ఆరోపణలపై ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఆరోపణలు నిరూపించకపోతే పరువునష్టం దావా వేసి చట్టపరంగా బుద్ధి చెబుతానని ఘాటుగా హెచ్చరించారు. గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడినారు.*🟧పరువునష్టం దావా వేస్తా.. వెనక్కి తగ్గేదే లేదు – ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు*”దేవాలయం నిధుల నుండి నేను ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. నాపై చేసిన అవినీతి ఆరోపణలను గురునాథం ఆధారాలతో నిరూపించాలి. లేకపోతే ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఆయన వెనుక ఉండి నడిపించే శక్తులు కూడా ఆయనను కాపాడలేవు!” అని తెలిపారు.*🟧శివుని ముందే ప్రమాణం చెయ్ గురునాథం*”దాతలు ఇచ్చిన డబ్బులు రూ.20 లక్షలు ఇంటికి తీసుకెళ్లానని అసత్య ప్రచారం చేస్తున్నావు. నీకు ధైర్యముంటే శివాలయంలో శివుడి ముందే ప్రమాణం చేయి. నేను గతంలోనే పెద్ద వ్యాపారవేత్తగా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తిని. దాతల డబ్బులతో లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు అని ఘటుగా హెచ్చరించారు.*🟧ప్రతి రూపాయికీ లెక్కలు సిద్ధం:- చైర్మన్*”దాతల నుంచి ఇప్పటివరకు వచ్చిన రూ. 8.50 లక్షల విరాళాల్లో జూన్ 20 నాటికి ఖర్చు చేయగా, మిగిలిన రూ. 1.95 లక్షల నిల్వతో సహా పూర్తి లెక్కలను పుస్తక రూపంలో ప్రింట్ తీసి పాలకమండలి సభ్యులందరికీ ఇచ్చాను. ప్రతి దాతకూ రసీదులు ఇచ్చాం. నవంబర్ మొదటి వారంలో దాతల పేర్లతో ఆలయంలో శిలాఫలకాలు కూడా ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.*🟧లక్ష రూపాయలు అడిగావు.. ఇవ్వలేదనే నా పైన కక్ష:*”గతంలో నా దగ్గర ఉన్న ఆలయ నిధుల నుండి రూ. లక్ష ఇవ్వాలని, తర్వాత ఇస్తానని గురునాథం నన్ను అడిగాడు. నేను దానికి తిరస్కరించినందుకే నాపై కక్ష పెంచుకున్నాడు. కనీసం వెయ్యి రూపాయలు కూడా దాతల నుంచి సేకరించని వ్యక్తికి నన్ను ప్రశ్నించే నైతిక హక్కు లేదు.”*🟧నాగ ప్రతిష్ట రచ్చపై చౌకబారు ఆరోపణలు:–*”శిథిలావస్థకు చేరిన గుడి వెనుక నాగ ప్రతిష్టల రచ్చను తొలగించేటప్పుడు గురునాథం, స్వామి, మహేష్, రంగారెడ్డి కూడా ఉన్నారు. అక్కడ డైమండ్లు, బంగారం ఉన్నాయని, వాటిని నేను తీసుకెళ్లానని ఆరోపించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం.”*🟧స్వామివారి సేవకే నా ప్రాధాన్యం:– ఆలయ చైర్మన్ బాలకృష్ణ నాయుడు*”జీవిత చరమాంకంలో భగవంతుడికి సేవ చేయాలనే ఒకే ఒక సంకల్పంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో, కూటమి భాగస్వామ్యమైన బిజెపి నాయకుడిగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించాను. నాకు ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించను.”*🟧సమావేశంలో పాల్గొన్నవారు:–*ఈ విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు అరుణ్ కుమార్, వసుధ, మమత, విజయ, ప్రధాన అర్చకులు నరేష్ కుమార్ శర్మ, ఆలయ వాచ్మన్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
