Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్
Oplus_16908288

అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ సూచించారు. మున్నేరు వరద పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మున్నేరు, ఆకేరు, పాలేరు పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం, వరద పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, నదుల వద్దకు ప్రజలు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని దుర్గ ప్రసాద్ సూచించారు.

అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *