Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

చోడపల్లిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చోడపల్లిలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • అన్నసమారాధనలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నదానం చేసిన AP RDC చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
  • గణేష్ మండపం వద్ద నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి AP RDC చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • తొలుత గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం భక్తులకు ప్రసాదం, అన్నాన్ని స్వయంగా వడ్డించారు.

అన్నసమారాధనలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నదానం చేసిన AP RDC చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ మండపం వద్ద నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి AP RDC చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం భక్తులకు ప్రసాదం, అన్నాన్ని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *