వార్త ముఖ్యాంశాలు
- స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనకాపల్లి డీఎస్పీ పి.వి.వి.
- నరసింహారావు తెలిపారు.
- ఈ నెల 14వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం శాంతిభద్రతల చర్యలు అమల్లోకి వచ్చాయన్నారు.అనకాపల్లి డివిజన్ వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనకాపల్లి డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం శాంతిభద్రతల చర్యలు అమల్లోకి వచ్చాయన్నారు.అనకాపల్లి డివిజన్ వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమ రవాణాపై ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ఓటర్లను బెదిరించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు.