Friday, 8 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేచే ప్రారంభమైన ఎఫ్2 ఫ్యామిలీ పార్క్ రెస్టారెంట్
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేచే ప్రారంభమైన ఎఫ్2 ఫ్యామిలీ పార్క్ రెస్టారెంట్

శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్కిట్ కాలేజ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎఫ్2 ఫ్యామిలీ పార్క్ రెస్టారెంట్’ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషిత రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పడటం ప్రాంతీయ అభివృద్ధికి మంచి సూచికని యువ పారిశ్రామికవేత్తలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదంగా సమయం గడిపేలా రెస్టారెంట్‌ను అందంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. రెస్టారెంట్ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారంలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.