Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వైసీపీ అక్రమాలకు ముగింపు పలకడమే కూటమి ప్రభుత్వ లక్ష్యయం- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైసీపీ అక్రమాలకు ముగింపు పలకడమే కూటమి ప్రభుత్వ లక్ష్యయం- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వార్థ రాజకీయాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా గందరగోళానికి గురిచేసి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు నెట్టివేశారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
  • శుక్రవారం శ్రీకాళహస్తిలోని పి.ఆర్.
  • గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజా విన్నపాల స్వీకరణ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా ఆలకించి అర్జీలు స్వీకరించారు.

శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వార్థ రాజకీయాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా గందరగోళానికి గురిచేసి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు నెట్టివేశారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం శ్రీకాళహస్తిలోని పి.ఆర్. గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజా విన్నపాల స్వీకరణ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా ఆలకించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నుంచి అధికంగా రెవెన్యూ, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో భూ రికార్డులను తారుమారు చేయడం, అక్రమ మార్పులు చేయడం వల్ల నిజమైన భూమి యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అందిన ప్రతి విన్నపాన్ని అధికారులు చట్టపరంగా పరిశీలించి వేగవంతంగా పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు ముగింపు పలికి పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *