Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పోలీసుల వినూత్న ప్రయత్నం – నేరాలకు చెక్ పెట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు శ్రీ సిటీ SI సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రాచకండ్రిగ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు – స్థానికుల హర్షం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పోలీసుల వినూత్న ప్రయత్నం – నేరాలకు చెక్ పెట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు శ్రీ సిటీ SI సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రాచకండ్రిగ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు – స్థానికుల హర్షం

వార్త ముఖ్యాంశాలు

  • వరదయ్యపాలెం / శ్రీ సిటీ, అక్టోబర్ 7: నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ శ్రీ సిటీ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
  • శ్రీ సిటీ ఎస్ఐ శ్రీ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాచకండ్రిగ మరియు పరిసర ప్రాంతాల్లో ముఖ్య కూడళ్లలో, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేశారు.
  • శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ఐ సుధీర్ రెడ్డి గారు తెలిపారు.

వరదయ్యపాలెం / శ్రీ సిటీ, అక్టోబర్ 7: నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ శ్రీ సిటీ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

శ్రీ సిటీ ఎస్ఐ శ్రీ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాచకండ్రిగ మరియు పరిసర ప్రాంతాల్లో ముఖ్య కూడళ్లలో, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేశారు.

శాంతి భద్రతల పరిరక్షణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ఐ సుధీర్ రెడ్డి గారు తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి నేరం జరిగినా క్షణాల్లో గుర్తించేందుకు ఈ నిఘా వ్యవస్థ దోహదపడుతుందన్నారు.

ఈ సందర్భంగా ఎస్ఐ సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ… “ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం. రాచకండ్రిగ పరిసర ప్రాంతాల్లో నేరాలు జరగకుండా ముందస్తు చర్యగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని కోరారు.

పోలీసు శాఖ చేపట్టిన ఈ మంచి కార్యక్రమంపై స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేర నియంత్రణలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఎస్ఐ సుధీర్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *