Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

తమ్ముడి హత్య కేసులో అన్నకు జీవిత ఖైదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తమ్ముడి హత్య కేసులో అన్నకు జీవిత ఖైదు

ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన రెడ్డిబోయిన నాగరాములు అలియాస్ నాగరాజుకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వసుకుల శీనయ్య తీర్పు చెప్పారు. తండ్రి ఆస్తి విషయంలో తమ్ముడు రామలింగంతో నాగరాజుకు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2022 జూన్ 9న రామలింగంపై నాగరాజు కర్రతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో జరిగిన విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నాగరాజుకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

తమ్ముడి హత్య కేసులో అన్నకు జీవిత ఖైదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *