వార్త ముఖ్యాంశాలు
- మర్రిపాడు: ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల జనసేన పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీలో మర్రిపాడు మండలానికి చెందిన మహిళా నాయకురాలు ప్రమీల ఓరుగంటికి చోటు లభించింది.
- ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం, ఎన్నికల వ్యూహాల అమలుకు ఈ కమిటీ పనిచేయనుంది.
మర్రిపాడు: ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల జనసేన పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీలో మర్రిపాడు మండలానికి చెందిన మహిళా నాయకురాలు ప్రమీల ఓరుగంటికి చోటు లభించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడం, ఎన్నికల వ్యూహాల అమలుకు ఈ కమిటీ పనిచేయనుంది. ప్రమీలకు అవకాశం కల్పించడంపై జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రమీల పేర్కొన్నారు.