వార్త ముఖ్యాంశాలు
- -- కార్పొరేటర్ అభ్యర్థులకు రూ.10 లక్షలు..
- కౌన్సిలర్లకు రూ.7.50 లక్షల ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
- ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ నంబరు 177/SEC-F1/2026 జారీ చేశారు.
— కార్పొరేటర్ అభ్యర్థులకు రూ.10 లక్షలు.. కౌన్సిలర్లకు రూ.7.50 లక్షల
ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ నంబరు 177/SEC-F1/2026 జారీ చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243–జెడ్ఏ, సంబంధిత పురపాలక చట్టాల నిబంధనల ప్రకారం గత నోటిఫికేషన్లను సవరిస్తూ కొత్త పరిమితులను నిర్ణయించారు.
పదవి | గరిష్ట వ్యయ పరిమితి
-గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ | రూ.40 లక్షలు |
— గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ | రూ.15 లక్షలు |
-ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ | రూ.25 లక్షలు |
— ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల కార్పొరేటర్ | రూ.10 లక్షలు |
-మున్సిపాలిటీ చైర్పర్సన్ | రూ.20 లక్షలు |
— మున్సిపాలిటీ కౌన్సిలర్ | రూ.7.50 లక్షలు |
— నగర పంచాయతీ చైర్పర్సన్ | రూ.10 లక్షలు |
–నగర పంచాయతీ వార్డు సభ్యుడు | రూ.5 లక్షలు |
ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.