Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: కోగిలి. దామరపు.హరికృష్ణ

తిరుపతి

కోట ఆకుతోట దిబ్బలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తులు, పేదలకు అన్నదానం *అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు తీగల సురేష్ బాబు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 కోట మండలం,*

కోట ఆకుతోట దిబ్బలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తులు, పేదలకు అన్నదానం *అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు తీగల సురేష్ బాబు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 కోట మండలం,* నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఆకుతోట దిబ్బ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేస్తున్నారు. శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు సాధన కిరణ్, ఉక్కు కిషోర్, రాఘవ, రాజా, పఠాన్ మౌలా బాష తదితరుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్ నాయకులు తీగల సురేష్ బాబు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, పేదలకు భోజనం వడ్డించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఉత్సవ ప్రాంగణంలో భక్తులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్థానికులు, భక్తులు ఉత్సవ ఏర్పాట్లలో భాగస్వాములవుతూ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుపతి

కోటలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 కోట మండలం*

*కోటలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 కోట మండలం* నెల్లూరు జిల్లా కోట మండలం‘సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు వారి ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని కోట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కృష్ణమ్మ సూచించారు. కోట పట్టణంలోని మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పౌష్టికాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాల్లో లభించే పోషక విలువలను వివరించారు. ‘పోషణ మాసం–మన అంగన్వాడి–మన బాధ్యత’ అనే సందేశంతో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు చెంగమ్మ, ఝాన్సీ, ఆశ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలు పాల్గొన్నారు.

తిరుపతి

పోషణ మహోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు* *పోషణ మహోత్సవాలతో పోషకాహారంపై అవగాహన* *చిల్లమూరు అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా కార్యక్రమాలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 చిట్టమూరు మండలం,*

*పోషణ మహోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు* *పోషణ మహోత్సవాలతో పోషకాహారంపై అవగాహన* *చిల్లమూరు అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా కార్యక్రమాలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 చిట్టమూరు మండలం,* పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం ఎంతో అవసరమని అవగాహన కల్పించే లక్ష్యంతో పోషణ మహోత్సవాలు–2026 కార్యక్రమాన్ని చిట్టమూరు మండలంలోని చిలమూరు పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. చిట్టమూరు సెక్టర్ సూపర్వైజర్ కవిత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని తల్లులకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, చిన్నారుల పెరుగుదల, పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా చిన్నారులకు వయస్సుకు అనుగుణంగా సమతుల్య ఆహారం అందించడం, గర్భిణులు మరియు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వివరించారు. తల్లులకు పోషకాహారంపై అవగాహన పోషణ మహోత్సవంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం సిబ్బంది గ్రామంలోని తల్లులతో మాట్లాడి రోజువారీ ఆహారంలో పోషక విలువలు కలిగిన పదార్థాలను చేర్చుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు తదితర పోషక పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైనప్పుడు అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తల సూచనలు తీసుకోవాలని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని అవగాహన కల్పించారు. సమన్వయంతో విజయవంతం కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ అంగన్వాడీ టీచర్లు, గ్రామంలోని తల్లులు, ఆశా వర్కర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోషణ మహోత్సవాల ఉద్దేశాలను గ్రామస్థులకు వివరించి, చిన్నారులు, తల్లుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ఉపయోగకరంగా ఉంటుందని సిబ్బంది తెలిపారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో పోషణ మహోత్సవాలు–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

తిరుపతి

*విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం పునరుద్ధరణ* *బ్యాంకుల సమ్మె అనంతరం అందుబాటులోకి సేవలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 17 కోట మండలం,*

*విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం పునరుద్ధరణ* *బ్యాంకుల సమ్మె అనంతరం అందుబాటులోకి సేవలు* కోట సెప్టెంబర్ 17 ప్రజా ప్రతిభ నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్‌లో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన యూనియన్ బ్యాంక్ ఏటీఎం సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. ఎన్‌బీకేఆర్‌ విద్యా సంస్థలకు సమీపంలో ఉన్న ఈ ఏటీఎం సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు, బ్యాంకు ఖాతాదారులు, పరిసర గ్రామాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ‘విద్యానగర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం అలంకారప్రాయమే!’ అనే శీర్షికతో న్యూస్99లో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కథనం అనంతరం బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె కూడా జరగడంతో ఏటీఎం సేవల పునరుద్ధరణలో జాప్యం కొనసాగింది. అయితే న్యూస్99లో ప్రచురితమైన కథనంపై స్పందించిన బ్యాంకు అధికారులు ఏటీఎంలోని సమస్యను పరిష్కరించి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో నగదు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఖాతాదారులు, వినియోగదారులకు ఇబ్బందులు తొలగాయి. న్యూస్99 కథనంపై స్పందించి ఏటీఎం సేవలను పునరుద్ధరించిన యూనియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బందికి విద్యానగర్ ఖాతాదారులు, వినియోగదారులు ధన్యవాదాలు తెలిపారు.*

తిరుపతి

గూడూరులో ప్రతిభా పురస్కార గ్రహీతలకు సన్మానం.* *ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు ఘన సత్కారం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 15 (గూడూర్ )*

*గూడూరులో ప్రతిభా పురస్కార గ్రహీతలకు సన్మానం.* *ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు ఘన సత్కారం.* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 15 (గూడూర్ )* గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో తూర్పు వీధి అంగనవాడి కేంద్రంలో కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పు వరకు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, కవులకు, సామాజిక సేవా తత్పరులకు గుర్తించి వారికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు ప్రకాశం జిల్లాలలోని పలు ప్రాంతాల్లోని పదిమందికి ప్రతిభా పురష్కార కార్యక్రమం జరిగింది. ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా నేటికీ 11 890 కార్యక్రమాలు నిర్వహించామని రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 మంది ని గుర్తించి వారికి అత్యంత ఘనంగా సన్మానం చేయడం జరిగింది ని తెలిపారు. మంగళవారం గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ అంగన్వాడి కేంద్రంలో సంస్థ గుర్తించిన పదిమందికి గౌరవ పురస్కార కార్యక్రమం నిర్వహించి సన్మాన గ్రహీతలకు షీల్డ్, ప్రశంసా పత్రం, మేడల్, శాలువాతో అత్యంత ఘనంగా సత్కరించారు. అంగన్వాడి కేంద్రం ఉపాధ్యాయిని సాజిద కి కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ పుష్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముప్పవరపు హరి ప్రసాదరావు విశ్రాంత ఆర్టిసి ఎంప్లాయిస్ కార్మికుల యూనియన్ (రాష్ట్ర నాయకులు), ముప్పవరపు శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత కండక్టర్ తోపాటు, నెల్లూరు పట్టణానికి చెందిన చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి, బొగ్గారపు రాధాకృష్ణమూర్తి ( నెల్లూరు) సూళ్లూరుపేట పట్టణానికి చెందిన డాక్టర్ బద్రి పీరాకుమార్, తో పాటు పలువురికి అత్యంత ఘనంగా గౌరవ పురస్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు, సన్మాన గ్రహీతల బంధువులు, ఎం వి రావు ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

వాకాడు ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ,* *రికార్డులు, స్టేషన్‌ నిర్వహణపై పరిశీలన..* *అధికారులకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సూచనలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 15 వాకాడు మండలం,*

*వాకాడు ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ,* *రికార్డులు, స్టేషన్‌ నిర్వహణపై పరిశీలన..* *అధికారులకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సూచనలు* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 15 వాకాడు మండలం,* వాకాడు: తిరుపతి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కె. నాగమల్లేశ్వర్‌ రెడ్డి మంగళవారం ఉదయం వాకాడులోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా స్టేషన్‌కు చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించి, విధుల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల పరిశీలన తనిఖీలో భాగంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను సూపరింటెండెంట్‌ పరిశీలించారు. కేసుల నమోదు, దర్యాప్తు, స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించిన వివరాలు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న ఇతర అధికారిక రికార్డులను పరిశీలిస్తూ సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో నిబంధనలు పాటించాలని సూచించినట్లు తెలిసింది. విధులపై ఆరా మండల పరిధిలో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, తనిఖీల పరిస్థితిపై అధికారులతో సూపరింటెండెంట్‌ చర్చించారు. నిబంధనల అమలులో అప్రమత్తంగా వ్యవహరించాలని, విధుల నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేసినట్లు సమాచారం. అధికారులు, సిబ్బంది హాజరు ఈ తనిఖీ కార్యక్రమంలో ఏఈఎస్‌ ప్రసాద్‌, స్థానిక సీఐ సురేష్‌కుమార్‌తో పాటు ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతాధికారి ఆకస్మిక తనిఖీతో స్టేషన్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. శాఖాపరమైన రికార్డులు, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

తిరుపతి

కోగిలిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు* *యువత ఐక్యతతో ఉత్సవ సందడి.. ఉట్టి కొట్టి ఆనందోత్సాహాలు* *భక్తిశ్రద్ధలతో వినాయకుడి శోభాయాత్ర..* *సముద్రంలో నిమజ్జనం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 15 చిట్టమూరు మండలం,*

*కోగిలిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు* *యువత ఐక్యతతో ఉత్సవ సందడి.. ఉట్టి కొట్టి ఆనందోత్సాహాలు* *భక్తిశ్రద్ధలతో వినాయకుడి శోభాయాత్ర..* *సముద్రంలో నిమజ్జనం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 15 చిట్టమూరు మండలం,* కోగిలి గ్రామంలో స్థానిక యువత ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన యూత్ సభ్యులంతా ఐక్యంగా ముందుకు వచ్చి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. పలువురు యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. వినాయకుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో పాటు యువత ఆధ్వర్యంలో పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. యువత ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టి సందడి చేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువకులు, గ్రామస్తులు కార్యక్రమాలను వీక్షిస్తూ ఆనందించారు. యువత ఐక్యతకు ప్రతీకగా ఉత్సవాలు కోగిలి యూత్ సభ్యులు అందరూ కలిసి గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా యువతంతా ఒకే వేదికపైకి వచ్చి కార్యక్రమాలను నిర్వహించారు. పరస్పరం సహకరించుకుంటూ ఉత్సవ ఏర్పాట్లు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడి శోభాయాత్ర ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో శోభాయాత్రగా సముద్ర నిమజ్జనానికి తీసుకెళ్లారు. యువత, భక్తులు గణనాథుడి నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్గమంతా పండుగ వాతావరణం నెలకొంది. సముద్రంలో వినాయకుడి నిమజ్జనం నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్న అనంతరం సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వినాయకుడిని సముద్రంలో నిమజ్జనం చేశారు. అనంతరం యువత, గ్రామస్తులు సముద్ర స్నానం చేసి సంతోషంగా తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కోగిలి యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని చాటేలా ఉత్సవాలు ఘనంగా ముగిశాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

తిరుపతి

మాట ఇచ్చాము.. నిలబెట్టుకున్నాం,* *వాకాడులో విద్యుత్ సమస్యకు పరిష్కారం..* *కొత్త స్తంభాలు, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ,* *ఇక తరచూ విద్యుత్ అంతరాయాలకు చెక్‌ పడుతుందని స్థానికుల ఆశాభావం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 12 వాకాడు మండలం,*

*మాట ఇచ్చాము.. నిలబెట్టుకున్నాం,* *వాకాడులో విద్యుత్ సమస్యకు పరిష్కారం..* *కొత్త స్తంభాలు, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ,* *ఇక తరచూ విద్యుత్ అంతరాయాలకు చెక్‌ పడుతుందని స్థానికుల ఆశాభావం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 12 వాకాడు మండలం,* విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా వాకాడు పట్టణంలోని బంగ్లా సెంటర్, చర్చ్ కాంపౌండ్ ప్రాంతాల ప్రజలు తమ విద్యుత్ సమస్యలను గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాశం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పాత స్తంభాలు.. విద్యుత్ లైన్లతో ఇబ్బందులు బంగ్లా సెంటర్, చర్చ్ కాంపౌండ్ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు సక్రమంగా లేకపోవడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. ప్రజల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త స్తంభాలు.. కొత్త విద్యుత్ లైన్లు ఎమ్మెల్యే సూచనల మేరకు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టి ఆయా ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ లైన్లను పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాలకు పరిష్కారం లభించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్ల పునరుద్ధరణతో బంగ్లా సెంటర్, చర్చ్ కాంపౌండ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల పాల్గొనడం ఈ కార్యక్రమంలో వాకాడు మండల టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర రెడ్డి, వేము దినకర్ బాబు, టీడీపీ యువ నాయకుడు బల్లి హర్ష నంద దయాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

తిరుపతి

ఎంపీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణ* *వాకాడు మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులోకి.. ఓటర్లు పరిశీలించుకునే అవకాశం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 11 వాకాడు మండలం,*

*ఎంపీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణ* *వాకాడు మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులోకి.. ఓటర్లు పరిశీలించుకునే అవకాశం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 11 వాకాడు మండలం,* వాకాడు మండల పరిధిలోని ఎంపీటీసీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో ప్రచురించినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని ఆయా గ్రామాలు, ఎంపీటీసీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల వివరాలను కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఓటర్లు తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. పేర్లు పరిశీలించుకోవాలి ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పేర్ల నమోదులో ఏవైనా తప్పులు, వివరాల్లో మార్పులు, పేర్లు గల్లంతు కావడం వంటి సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణ కీలకమైన ప్రక్రియగా అధికారులు పేర్కొంటున్నారు. జాబితా ప్రచురణతో ఓటర్లకు తమ వివరాలను ముందుగానే తెలుసుకునే అవకాశం లభించింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో ప్రచురించిన ఓటర్ల జాబితాను సంబంధిత గ్రామాల ప్రజలు పరిశీలించి, తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

తిరుపతి

అతివేగంతో అదుపుతప్పిన కారు* *రొయ్యలగుంటలోకి దూసుకెళ్లిన కారు* *తృటిలో తప్పిన పెను ప్రమాదం*. *నాయుడుపేట మండలం పూడేరు చెందిన నలుగురు సురక్షితం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 10 వాకాడు మండలం,*

*అతివేగంతో అదుపుతప్పిన కారు* *రొయ్యలగుంటలోకి దూసుకెళ్లిన కారు* *తృటిలో తప్పిన పెను ప్రమాదం*. *నాయుడుపేట మండలం పూడేరు చెందిన నలుగురు సురక్షితం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 10 వాకాడు మండలం,* *తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం బీచ్‌కు వెళ్తున్న సమయంలో ఓ కారు అదుపుతప్పి రొయ్యలగుంటలోకి దూసుకెళ్లిన ఘటన వాకాడు మండలం కొండూరు సమీపంలోని రొయ్యలగుంట మలుపు వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాయుడుపేటకు మండలం పూడేరుకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో తూపిలిపాలెం బీచ్‌కు వెళ్తుండగా, కొండూరు సమీపంలోని రొయ్యలగుంట మలుపు వద్ద కారు అతివేగంగా వెళ్లడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రహదారి పక్కనే ఉన్న రొయ్యలగుంటలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు సహకరించారు.*