Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Tirupati

తిరుపతి

ఆపరేషన్ త్రిశూల్‌ లో భాగంగా చిలమత్తూరు లో అవగాహన సదస్సు

తిరుపతి జిల్లా వరదయ్య పాలెం చిలమత్తూరు శ్రీ సిటీ ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వరదయ్య పాలెం మండలం చిలమత్తూరు గ్రామంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శ్రీ సిటీ డి ఎస్పీ శ్రీనివాసులు మరియు సి ఐ పరి వేక్షణ లో ఎస్ ఐ ప్రియాంక ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్బంగా మహిళా భద్రత, గంజాయి నిర్మూలన మరియు రోడ్డు భద్రత అంశాలపై అక్కడ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు, యువత మరియు గ్రామ ప్రజలకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీస్ సహాయ సేవలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల నిర్మూలన లో ప్రజల భాగస్వామ్యం గురించి వివరించడం జరిగింది. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమానికి 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు, అదేవిదంగా మహిళలు, యువత మరియు ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరడమైనది. ఈ కార్యక్రమం లో పోలీస్ కానిస్టేబుల్ రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమల, సెప్టెంబర్ 21, 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 20న మొత్తం 72,019 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ రోజు తిరుమలలో నమోదైన భక్తుల వివరాలు: 👥 మొత్తం భక్తులు: 72,019 🪒 తలనీలాలు సమర్పించిన భక్తులు: 25,431 💰 హుండీ కానుకలు: ₹3.50 కోట్లు 🍬 లడ్డూ విక్రయాలు: 4.64 లక్షలు 🍚 అన్నప్రసాదం: 2.03 లక్షలు 🏥 అశ్విని ఆసుపత్రి సేవలు పొందిన వారు: 3,736 ⏳ నేటి దర్శన పరిస్థితి సెప్టెంబర్ 21న తిరుమలలో ప్రస్తుతం 6 వెయిటింగ్ కంపార్టుమెంట్లు ఉన్నాయి. SSD టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితులను గమనించి తమ దర్శన ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచన. ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా.. గోవిందా!

తిరుపతి

తిరుమల భక్తులకు ముఖ్య సమాచారం.. సెప్టెంబర్ 23 వరకు SSD, DD టోకెన్ల జారీ నిలిపివేత

సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో SSD, DD టోకెన్ల జారీకి విరామం తిరుమల, సెప్టెంబర్ 20:తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల దర్శన ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో SSD, DD టోకెన్ల జారీ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. భక్తుల రద్దీ, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న సాయంత్రం 4 గంటల నుంచి దర్శన టోకెన్ల జారీ తిరిగి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి టోకెన్ల ద్వారా దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. టోకెన్లు నిలిపివేసిన సమయంలో తిరుమలకు వచ్చే భక్తులు సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని సూచించింది. 📌 ముఖ్య తేదీలు 🔹 సెప్టెంబర్ 14–23: SSD, DD టోకెన్ల జారీ నిలిపివేత🔹 సెప్టెంబర్ 23, సాయంత్రం 4 గంటలు: టోకెన్ల జారీ పునఃప్రారంభం🔹 సెప్టెంబర్ 24 నుంచి: టోకెన్ల ద్వారా దర్శనం భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఓం నమో వేంకటేశాయ 🙏 | గోవిందా గోవిందా!