Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Telugu News

ASIFABAD

నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్ నియామకం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన: రెబ్బెన మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్‌ను నియమించారు. సీనియర్ కార్యకర్తగా గుర్తించి తనకు ఈ బాధ్యత అప్పగించిన జిల్లా, మండల కమిటీలకు గజ్జల సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్‌కుమార్‌ కన్నుమూత

సోషల్‌ మీడియాలో ‘అగ్గిపెట్టె మచ్చ’గా గుర్తింపు పొందిన కిరణ్‌కుమార్‌ కన్నుమూసినట్లు సమాచారం. కొద్దిరోజులుగా అనారోగ్యంతో స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని తిరుపతి రూరల్‌లోని వైఎస్సార్‌ కాలనీకి తరలిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు హేయం

అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యేల మెడ, జుట్టు పట్టుకుని లాగడం, చీర లాగడం దారుణమన్నారు. ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిపి, బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

హైదరాబాద్

వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తాతా మధు

తాను అనని మాటలను తనకు ఆపాదిస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. తన డొక్కలో పోలీసులు పిడిగుద్దులు గుద్దినా తాను ఏమీ మాట్లాడలేదన్నారు. అసహనంతో తాను అనని మాటలను స్పీకర్‌కు ఆపాదించారని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మహిళా శాసనసభ్యులపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన విషయాలను రేపు కౌన్సిల్‌లో మాట్లాడతానన్నారు.