Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Talasani Srinivas Yadav

హైదరాబాద్

మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రలో చమత్కార వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా అనుకరిస్తూ, “హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నాం.. ఏ సంవత్సరం వంద రోజులో చెప్పలేదు కదా!” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, రైతుల సమస్యలు, ఢిల్లీ నాయకత్వంతో ఇబ్బందులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

హైదరాబాద్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు దారుణం: తలసాని

అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం దారుణమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయని, మహిళా ఎమ్మెల్యేలతోనూ అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్‌కు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

అసెంబ్లీ బయట అరెస్టులపై తలసాని ఫైర్

అసెంబ్లీ సమావేశాలకు రమ్మని చెప్పి బయటే బీఆర్ఎస్ సభ్యులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు నల్ల టీషర్టులతో వచ్చిన సభ్యులను అసెంబ్లీలోకి వెళ్లకముందే అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మహిళా సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ నల్ల టీషర్ట్‌తో వెళ్లవచ్చని, తమ సభ్యులు మాత్రం ధరించకూడదా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.