Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బండి రాజు గౌడ్ కుటుంబానికి పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సహాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బండి రాజు గౌడ్ కుటుంబానికి పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సహాయం

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బండి రాజు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు…
  • అనంతరం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో ఉన్న వారి ఆర్ధిక పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు రాజు కుటుంబానికి సహకారం అందించాలని బండారి కొమురయ్య, దండు రమేష్, పొన్నం శ్రీనివాస్ లు పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్ కు…
  • దండు చిరంజీవి ముదిరాజ్ స్పందించి గ్రామ శాఖ బాధ్యులు సోనబోయిన రాజు ముదిరాజ్, భూమ సంపత్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పిఆర్ ముదిరాజ్ సేవా సమితి వ్యవస్థాపకులు పెసరు రాజన్న ముదిరాజ్, రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్ లు 100 కేజీలు బియ్యం మరియు తోటకూరి…

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బండి రాజు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్ మరియు మిత్రులు పరామర్శించారు. అనంతరం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో ఉన్న వారి ఆర్ధిక పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు రాజు కుటుంబానికి సహకారం అందించాలని బండారి కొమురయ్య, దండు రమేష్, పొన్నం శ్రీనివాస్ లు పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్ కు తెలియజేశారు. దండు చిరంజీవి ముదిరాజ్ స్పందించి గ్రామ శాఖ బాధ్యులు సోనబోయిన రాజు ముదిరాజ్, భూమ సంపత్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి వ్యవస్థాపకులు పెసరు రాజన్న ముదిరాజ్, రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్ లు 100 కేజీలు బియ్యం మరియు తోటకూరి పెద్ద రాజు 25 కేజీల బియ్యం మొత్తం 125 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం బండి రాజు గౌడ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ కులాలకు అతీతంగా ఐక మత్యంతో కలిసి ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ చేయూతను అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని సూచించారు.
కీర్తిశేషులు బండి రాజు కుటుంబానికి సహకారం అందించిన పెసరు శాంతమ్మ – సత్యనారాయణ ఫౌండేషన్ చైర్మన్ పెసరు రాజన్న ముదిరాజ్, పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్, తోటకూరి పెద్ద రాజు మరియు దహన సంస్కారాలకు కర్ర సహకారం అందించిన సోనబోయిన అనిత-రాజు లకు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మృతుని భార్య సంధ్య మాట్లాడుతూ
నా భర్త చనిపోయి కష్టకాలంలో ఉన్న మాకు తోడుగా నిలిచి దహన సంస్కారాలు నిర్వహించలేని స్థితిలో ఉన్న మాకు సాయం చేసిన వారికి అదే విధంగా చేయూతను అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్, దండు రాజు, శివకృష్ణ, సందీప్,
ఎస్ కే గోరేమియా, భూరగాని వేణు బండారి కొమురయ్య, సోనబోయిన రాజు, దండు సాంబయ్య, బండి వీరన్న, మేక రమేష్, అక్కపెల్లి రాజేందర్, గంగరబోయిన నవీన్, భూరగాని మధుసాయి, రాములు, రాజు, రమేష్, సందీప్ లతో పాటు కుటుంబ సభ్యులు భార్య సంధ్య, కుమారుడు అభయ్, కూతురు అక్షిత లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *