Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం చెల్లించాలి…బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం చెల్లించాలి…బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం చెల్లించాలి...బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్.
  • ఈరోజు నర్సంపేట రూరల్ మండలంలోని గురిజాల గ్రామంలో బి.ఆర్.ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాట్లు వేసి నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను రైతులతో కలిసి బి.ఆర్.ఎస్ నాయకులు పరిశీలించారు.
  • ఈ కార్యక్రమంలో పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోటూరి రవి మాట్లాడుతూ గురిజాల లో చాలామంది రైతులు వరి మరియు ఇతర పంటలు సాగు చేశారని నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారుల ద్వారా సర్వే చేయించి ఎకరాకు యాబై…

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం చెల్లించాలి…బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్.

ఈరోజు నర్సంపేట రూరల్ మండలంలోని గురిజాల గ్రామంలో బి.ఆర్.ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాట్లు వేసి నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను రైతులతో కలిసి బి.ఆర్.ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోటూరి రవి మాట్లాడుతూ గురిజాల లో చాలామంది రైతులు వరి మరియు ఇతర పంటలు సాగు చేశారని నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారుల ద్వారా సర్వే చేయించి ఎకరాకు యాబై నష్టపరిహారం రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
గతంలో అధిక వర్షాలు పడి రైతులు నష్టపోతే స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో ఆరోజు రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లు గడ్డం కొమురయ్య,బండారి రమేష్,మాజీ రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,అల్లి రవి,మాజీ ఉప సర్పంచ్ మంచిక హరీష్,వార్డు సభ్యుడు గజ్జి రాము,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రి కుమారస్వామి,యూత్ మండల ప్రధాన కార్యదర్శి సంగం శ్రీకాంత్,సీనియర్ నాయకులు మర్ద నవీన్,నీలం కృష్ణమూర్తి,ఎడ రమేష్,మాటూరి రవీంద్ర చారి,యశోద నర్సింగం, ఆకుల అశోక్,దూడల ప్రవీణ్,శ్రీరామోజు బ్రహ్మచారి,బండారి అశోక్,చిర్ర యాకూబ్,చిర్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *