Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: School

నంద్యాల

మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మిట్నాల మోడల్ స్కూల్ నూతన ఎస్ఎంసీ చైర్మన్ చాకలి నాగరాజు

నంద్యాల మండలం మిట్నాల గ్రామంలోని మోడల్ స్కూల్ నూతన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్.ఎమ్.సి) చైర్మన్‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చాకలి నాగరాజు నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయం నందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఫరూక్ చాకలి నాగరాజును శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. మోడల్ స్కూల్ అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన వసతులు కల్పించే దిశగా నిరంతరం కృషి చేయాలని మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా చైర్మన్ చాకలి నాగరాజు మాట్లాడుతూ పాఠశాల సమగ్ర అభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మరియు పాఠశాల పురోగతికి పాలకవర్గం తరపున అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ఆశీస్సులు అందించిన గౌరవ మంత్రి ఫరూక్ గారికి ఆయన పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి , ప్రదీప్ రెడ్డి, రవి చౌదరి తదితరులు పాల్గొన్నారు

నంద్యాల

రేకుల షెడ్లలో స్కూళ్లపై చర్యలు

నంద్యాల -: నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, అగ్నిమాపక, భవన భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలని కోరారు.ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్, పీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

నంద్యాల

నంద్యాల మండలంలో వైసిపి బోణీ: పాఠశాల విద్యా కమిటీ ఏకగ్రీవం

నంద్యాల మండలం వెంకటేశ్వరపురం ఎంపిపి పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ ఛైర్మన్‌గా చిన్న ఓబులేషు, వైస్ ఛైర్మన్‌గా పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాఠశాల వెలుపల సంబరాలు జరుపుకొని, నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.

నంద్యాల

నేడు నంద్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నంద్యాల: నంద్యాల జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్. హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి కోరారు

నంద్యాల

రేపు కృష్ణాష్టమి: పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

హైదరాబాద్/అమరావతి:శ్రీ కృష్ణాష్టమి (జన్మాష్టమి) పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 4న (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సముదాయాలు మాత్రం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి వేడుకల్లో పాల్గొనేందుకు ఈ సెలవు ఉపకరించనుంది.

నంద్యాల

DEO జనార్ధన్ రెడ్డిని విధుల నుంచి తప్పించాలి

నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి. జనార్ధన్ రెడ్డిని DEO బాధ్యతల నుంచి తప్పించి, ఆయనపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు డిమాండ్ చేశారు.కర్నూలు డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా FAC బాధ్యతలు నిర్వహిస్తూ నంద్యాల జిల్లా DEOగా కూడా అదనపు బాధ్యతలు చేపట్టడం వల్ల విద్యాశాఖ పర్యవేక్షణపై ప్రభావం పడుతోందని ఆయన ఆరోపించారు. విద్యాశాఖలోని పలు అంశాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల వచ్చిన వరుస కథనాలను అధికారులు సుమోటోగా స్వీకరించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని రంగనాయుడు డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే DEOపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పించాలని కోరారు.

నంద్యాల

శ్రీ లక్ష్మీ స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నంద్యాల: శ్రీ లక్ష్మీ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ మేడం మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. జైహింద్ నినాదాలతో పాఠశాల ప్రాంగణం మార్మోగింది.

నంద్యాల

కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొత్తపల్లి: గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ మార్క్‌ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.