Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Ramesh Naidu

తూర్పు గోదావరి

పెదపూడి మండలంలో రూ.4.70 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

రెండేళ్లలో రూ.278 కోట్లతో అభివృద్ధి పనులు: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పెదపూడి, అక్టోబరు 9 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలంలో రూ.4.70 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. మండలంలో గత రెండేళ్లలో సుమారు రూ.278 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పురందేశ్వరి తెలిపారు. గొల్లల మామిడాడలో రూ.35 లక్షలు, రూ.25 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను, కుమారప్రియంలో రూ.1.90 కోట్లతో అభివృద్ధి చేసిన బీటీ రోడ్డును, రూ.15.50 లక్షలతో నిర్మించిన జెడ్పీ హైస్కూల్ ప్రహరీని ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దాత మాగం సత్యనారాయణ అందించిన రూ.10 లక్షల విరాళంతో నిర్మించిన రేకుల షెడ్డును ప్రారంభించారు. పెదపూడిలో రూ.1.75 కోట్లతో అభివృద్ధి చేసిన సీసీ రోడ్డును, రూ.30 లక్షలతో నిర్మించిన గాంధీ స్మారక జెడ్పీ హైస్కూల్ ప్రహరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత అవకాశం ఏర్పడిందన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావడం, రైల్వే జోన్‌తో పాటు రహదారులు, రైల్వే సదుపాయాల కల్పనలో కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు. అనపర్తి ప్రాంత ప్రజల సౌకర్యార్థం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సాధించడం కూడా ఈ సహకారంలో భాగమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019–2024 మధ్య అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారుల నిర్మాణం పూర్తవుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’కు అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గ, పెదపూడి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, గొల్లల మామిడాడ, కుమారప్రియం, పెదపూడి గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఒడిశా తెలుగు రైతులకు అండగా ఎంపీ పురంధేశ్వరి

పెదపూడిలో అభినందన సభ.. ఘనంగా సత్కరించిన రైతులు పెదపూడి, అక్టోబరు 9 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న తెలుగు రైతుల ధాన్యం కొనుగోలు సమస్యను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిష్కరించడంతో పెదపూడిలో రైతులు ఆమెను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎంపీ చొరవతో ఒడిశా మంత్రులకు సమాచారం అందిన అరగంటలోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒడిశాలో సుమారు 50 వేల మంది తెలుగు రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెదపూడి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ ప్రారంభించారు.

తూర్పు గోదావరి

సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు

పందలపాకలో పీఎం సూర్యఘర్‌పై అవగాహన సదస్సు బిక్కవోలు, అక్టోబరు 9 (పున్నమి ప్రతినిధి): పందలపాక ఎన్టీఆర్ కాలనీలో సేవాసేతు కార్యక్రమంలో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి సబ్సిడీ సోలార్ ప్యానెళ్ల ప్రదర్శనను ప్రారంభించారు. సౌర విద్యుత్తుతో విద్యుత్తు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. ప్రజలు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పందలపాక ఎన్టీఆర్ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, విద్యుత్తు శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి

రాజమహేంద్రవరం, అక్టోబరు 8 (పున్నమి ప్రతినిధి): దేశ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నిర్వహిస్తున్న నెలరోజుల **‘సేవా సంకల్ప్ అభియాన్’**లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ‘అంగన్వాడీ మిలన్ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. 1975లో సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్‌) కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన అంగన్వాడీ వ్యవస్థ కాలానుగుణంగా విస్తరిస్తూ, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారం వారి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా ఇంటింటికీ పోషకాహారం పంపిణీ చేసే సందర్భాల్లో అది నిజంగా అర్హులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకే అందేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. కుటుంబంలోని ఇతర సభ్యులు ఆహారాన్ని తీసుకునే పరిస్థితులు లేకుండా, అర్హులైన లబ్ధిదారులే దానిని వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. గర్భధారణ సమయంలో మహిళలకు పౌష్టికాహారంతో పాటు కుటుంబ సభ్యుల సహకారం, ప్రశాంతమైన వాతావరణం కూడా అవసరమని ఎమ్మెల్యే సూచించారు. తల్లి ఆరోగ్యం, పోషణపై తీసుకునే జాగ్రత్తలు పుట్టబోయే శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. శిశువులకు తల్లిపాలు అందించడం ద్వారా అవసరమైన పోషకాలు లభిస్తాయని, తల్లులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలను పాటించాలని సూచించారు. దేశ భవిష్యత్‌ తరాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోషకాహార లోపాన్ని తగ్గించడం, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపరచడం, గర్భిణులు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించడం వంటి అంశాల్లో అంగన్వాడీ సిబ్బంది మరింత చురుకుగా పనిచేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలను నిర్వహించడం మాత్రమే కాకుండా, వాటి ద్వారా అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయా లేదా అన్నది నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీ సిబ్బంది లబ్ధిదారులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ఉద్దేశ్యం ప్రజలకు చేరినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలు కలిసి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించగలమన్నారు. భవిష్యత్‌ తరాలు ఆరోగ్యవంతంగా ఎదగాలంటే చిన్ననాటి నుంచే పోషకాహారం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని, ఈ విషయంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి కోరారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రాజ ముద్రతో 1,290 పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ

జి.దొంతమూరు, అక్టోబరు 8 (పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం జి.దొంతమూరులో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా 1,290 మంది రైతులకు రాజ ముద్రతో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూ సమస్యలను పరిష్కరించి, భూ రికార్డులను సమగ్రంగా సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాస్‌బుక్‌లపై వ్యక్తుల ఫొటోలకు బదులుగా రాజముద్రతో అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి భూవివాదాలు లేకుండా రికార్డులను పక్కాగా రూపొందిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ.1,200 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. రైతుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనంత అరణ్య ప్రాజెక్ట్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి, అక్టోబరు 8 (పున్నమి ప్రతినిధి): అనపర్తి కొత్తూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటినరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ‘వీబీ-జీ రామ్ జీ’ పథకంలో భాగంగా ‘అనంత అరణ్య ప్రాజెక్ట్’లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేసే మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, నీరు, పంచభూతాలను పరిరక్షించాలని కోరారు. గ్రామాల్లో ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి ఔషధ, వన, బుష్ జాతుల మొక్కలను పెంచాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. కళాశాల మౌలిక వసతుల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రామవరంలో ఘనంగా 9వ జాతీయ పోషణ మాసం

గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, అక్టోబరు 8 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలోని కర్రి జట్లా రెడ్డి కళ్యాణ మండపంలో 9వ జాతీయ పోషణ మాసం–2026 ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అంగన్వాడీ వ్యవస్థ కీలకమని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. పోషకాహారం అందించడంతో పాటు గర్భిణులకు ఆరోగ్యకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల సహకారం అవసరమన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల హాజరు, పోషకాహార పంపిణీ సక్రమంగా జరిగేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమాలను కేవలం మొక్కుబడిగా నిర్వహించకుండా గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యులకు సంపూర్ణ అవగాహన కల్పించేలా చేపట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రామవరంలో 9వ జాతీయ పోషణ మాసం

అనపర్తి, అక్టోబరు 8 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలోని కర్రి జట్లా రెడ్డి కళ్యాణ మండపంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల హాజరు, పోషకాహార పంపిణీ సక్రమంగా జరిగేలా సిబ్బంది శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమాలను మొక్కుబడిగా కాకుండా అవగాహన కల్పించేలా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

తూర్పు గోదావరి

అనపర్తిలో ఘనంగా ‘సేవా జ్యోతి’ యాత్ర

1000 బైకులతో భారీ ర్యాలీ అనపర్తి, అక్టోబరు 7 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ‘సేవా జ్యోతి’ యాత్రను ఘనంగా నిర్వహించారు. రామవరం నుంచి సుమారు 1000 బైకులతో భారీ ర్యాలీగా బయలుదేరిన కూటమి శ్రేణులు అనపర్తి చేరుకున్నారు. అనంతరం దేవి చౌక్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు కాగడాలతో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానం సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా మోదీ దేశానికి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. రక్షణ, సంక్షేమం, ఆరోగ్యం, సాంకేతికత, ఆర్థిక రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటడం, అంగన్వాడీ ఉత్సవాలు తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. సేవా జ్యోతి యాత్రను విజయవంతం చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి

మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ స్ఫూర్తిదాయకం

రాజమహేంద్రవరం, అక్టోబరు 7 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని చెరుకూరి గార్డెన్స్‌లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ మోదీ సుదీర్ఘ ప్రజా జీవితం, సేవా దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మోదీ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత దేశాభివృద్ధిలో చురుకైన భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకులు మోదీ సేవలను కొనియాడారు.