Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ఒడిశా తెలుగు రైతులకు అండగా ఎంపీ పురంధేశ్వరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఒడిశా తెలుగు రైతులకు అండగా ఎంపీ పురంధేశ్వరి

పెదపూడిలో అభినందన సభ.. ఘనంగా సత్కరించిన రైతులు

పెదపూడి, అక్టోబరు 9 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న తెలుగు రైతుల ధాన్యం కొనుగోలు సమస్యను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిష్కరించడంతో పెదపూడిలో రైతులు ఆమెను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎంపీ చొరవతో ఒడిశా మంత్రులకు సమాచారం అందిన అరగంటలోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒడిశాలో సుమారు 50 వేల మంది తెలుగు రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెదపూడి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ ప్రారంభించారు.

ఒడిశా తెలుగు రైతులకు అండగా ఎంపీ పురంధేశ్వరి

ఒడిశా తెలుగు రైతులకు అండగా ఎంపీ పురంధేశ్వరి

ఒడిశా తెలుగు రైతులకు అండగా ఎంపీ పురంధేశ్వరి

ఒడిశా తెలుగు రైతులకు అండగా ఎంపీ పురంధేశ్వరి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *