Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Punnami News

ప్రకాశం

🚨 కనిగిరిలో రెట్టింపు డబ్బుల మోసం కేసులో ఆరుగురు అరెస్ట్ రూ.13.28 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాలో రూ.31.70 లక్షలు సీజ్‌

రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ ప్రజల నుంచి నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మార్కాపురం జిల్లా పోలీసుల ప్రెస్‌నోట్‌లో తెలిపారు. కనిగిరి, హెచ్‌.ఎం.పాడు, పి.సి.పాడు, మార్రిపూడి పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల ప్రకారం.. నిందితులు ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి, వారి నుంచి నగదు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల నుంచి సేకరించిన మొత్తానికి సంబంధించి బ్యాంక్ లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్నవి 🔹 రూ.13,28,000 నగదు 🔹 బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.31,70,000 🔹 సాఫ్ట్‌వేర్/డిజిటల్ పరికరాలు 🔹 బ్యాంక్‌కు సంబంధించిన రసీదులు, పత్రాలు 🔹 Canon కంపెనీ ప్రింటర్ 🔹 సర్టిఫికెట్లు 🔹 AP37DE5998 నంబర్ గల కారు నిందితులపై BNS 318(4), 316(2) r/w 3(5) సెక్షన్లతో పాటు APPDFE Act-1999 సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. Video Link: https://www.instagram.com/reel/DeEybXtTfHA/?stkn=Yzd1czVhdXZyZHQ5 Uploaded Video:

పల్నాడు

*నాదెండ్లలో ఘనంగా జాతీయ పోషణ మాసం, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ,MLA.పత్తిపాటి పుల్లారావు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల*

నాదెండ్ల లో నిర్వహించిన జాతీయ పోషణ మాసం, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకురాలు నాగమల్లేశ్వరి, హెచ్‌డీఎస్ ప్రసన్న కుమారి పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, పౌష్టికాహార లోపం నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కార్యక్రమంలో వివరించారు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని సూచించారు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు పౌష్టికాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు

పల్నాడు

*బయోఫ్లాక్, ఆర్.ఏ.ఎస్ (RAS) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు మరియు మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. *

నరసరావుపేట, సెప్టెంబర్ 24 గురువారం కలక్టరేట్ లోని మీడియా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పధకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తొలుత ముందుగా గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ లోని రూ. 50 లక్షలకు సంబంధించి రెండు బయోఫ్లాక్ పాండ్స్ 2 , మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ ల పంపిణీకి లబ్దిదారులను ఎంపిక చేసి ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను నిర్ణీత గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. PMMSY క్రింద జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులను ఎంపిక చేయాలని కమిటీకి సూచించారు. కోల్డ్ స్టోరేజ్ లు , ఐస్ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలెండర్లు , సిన్టెక్స్ బాక్సులు , ఫిష్ రిటైల్ మార్కెట్ నిర్మాణం , చేపల రవాణాకు మూడు చక్రాలతో కూడిన ప్రత్యేక వాహనాలు , జలాశయాల్లో చేప పిల్లలను నిల్వ చేయడం ఫిష్ కియోస్క్ ల ఏర్పాటు , తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి సిద్దం చేయాలన్నారు. జిల్లా మత్స్య శాఖాధికారి పి. ప్రసాద్ , జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, పల్నాడు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె. రాం ప్రసాద్, ఈఈ ఎన్ ఎస్ పి ఈ. శ్రీనివాస రావు , డీఆర్డీఏ , కృషి విజ్ఞాన్ కేంద్రం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

పల్నాడు

సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కు ఘన విజయం

సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కు ఘన విజయం సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కు చెందిన 9వ తరగతి విద్యార్థి శ్లోక్ గుప్తా జాతీయ స్థాయి “గ్లాస్ ఇన్ ఇనిస్ట్యూషన్” ఆగష్టు 12 వ తేది జరిగిన పోటీలో మూడవ బహుమతిని సాధించి, విద్యాలయానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతను సాధించాడు. ఈ పోటీలో ₹10,000 నగదు బహుమతిని 19-09-2026 తేదిన శ్లోక్ గుప్తా అందుకున్నాడు. ఈ పోటీని ఆల్ ఇండియా గ్లాస్ మాను్ఫాక్చరర్స్’ ఫెడరేషన్ (ఎ.ఐ.జీ.యం.యఫ్) నిర్వహించింది.ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపే విషయం ఏమిటంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కె.వి.యస్ )లో విజేతలుగా ఎంపికైన విద్యార్థుల్లో శ్లోక్ గుప్తా ఒక్కరే కె.వి.యస్ తరఫున ఎంపిక కావడం విశేషం.ఈ ప్రతిభ, అంకితభావం సత్తెనపల్లికి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలపాలని పాఠశాల ఉపాధ్యాయులు శ్లోక్ గుప్తా కు అభినందనలు తెలిపారు..

పల్నాడు

*పి.జి.ఆర్.ఎస్ సేవలపై క్యూ.ఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్: కలెక్టర్ కృతిక శుక్ల*

పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) సేవలలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు పౌరులు క్యూ.ఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు. ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిల్లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన క్యూ.ఆర్ కోడ్‌ను ప్రజలు తమ మొబైల్ ద్వారా స్కాన్ చేసి సులభంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, https://pgrs.ap.gov.in పోర్టల్ ద్వారా కూడా తమ స్పందనను పంచుకోవచ్చని, అర్జీల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మెరుగైన సేవల కోసం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పల్నాడు

*డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్బంగా నర్సరావుపేట లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం*

డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్బంగా 16/09/2026 అనగా బుధవారం ఉదయం 9 గంటలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.ఈ వైద్య శిబిరం నందు కామినేని ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గుండె(కార్డియో) నరములు (న్యూరాలజి) సంబంధిత వ్యాధుల గురించి ఉచిత మెగా వైద్య శిబిరం జరుగును.ఈ వైద్య శిబిరం నందు బీపీ, షుగర్, అవసరమైన వారికి ఈసీజీ, 2D ఎకో పరీక్షలు పూర్తి ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వబడును .కావున నరములు, గుండె, నేత్ర సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందగలరు.అదే విధంగా శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం కూడా జరుగును. కావున నేత్ర, కంటి, గుండె సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరుతున్నాను.ఈ వైద్య శిబిరమునకు హాజరగు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డ్ లేదా జిరాక్స్ తప్పక తీసుకొని రావలయును .స్థలం:- డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి ,రాజాగారి కోట ,నరసరావుపేట సమయం:- ఉదయం 9 గంటలకు. ఇట్లు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్టు

పల్నాడు

*పల్నాడు జిల్లాలో జడ్పీటీసీ వారిగా ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో*

నర్సరావుపేట :జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో ,రాబోయే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జడ్పీటీసీ) సాధారణ ఎన్నికల నిమిత్తం ఓటర్ల తుది జాబితాలను మండలాల వారీగా విడుదల చేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జడ్పీ సీఈవో జ్యోతి బసు జిల్లా పరిధిలోని 28 జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 11,81,399 ఓట్లు కాగా పురుషులు 5,84,394. మహిళలు 5,96,937. ఇతరుల ఓట్లు 68 ఉన్నాయి. ఈ జాబితాల ఆధారంగా రాబోయే ఎన్నికలకు అవసరమైన పోలింగ్ ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు.

పల్నాడు

*కాలువలో భారీగా నిలిచిపోయిన వ్యర్థాలు మురికి నీరు*

ఇది పల్నాడు బస్టాండ్ లోని రిలయన్స్ మార్ట్ పక్కన… వైష్ణవి ట్రేడర్స్ అండ్ బోర్వెల్స్.. దగ్గర ఉన్న కాలవలో ఉన్నచెత్త వ్యర్థాలు.. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా భారీ స్థాయిలో పేరుకుపోయి, వ్యాపారస్తులకు ,వినియోగదారులకి.. ఆ ప్రాంతంలో ఉన్న కళాశాల విద్యార్థులు నిత్యం సంచరించే ప్రాంతం మరియు.. అనుకోనటువంటి వ్యాధులు రావచ్చు కాబట్టి దీన్ని త్వరగా పుడుకుపోయిన ప్రాంతంలో వ్యర్థాలు తొలగించాలని ఆ ప్రాంత నివాసులు కోరుకుంటున్నారు Uploaded Video:

పల్నాడు

* చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు. *

*ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా *పలువురికి గాయాలు* చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ఒంగోలు సమీపంలోని ఈతముక్కలకు చెందిన వూట్ల రాజేశ్వరి(24) క్యాన్సర్ చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరుగు ప్రయాణంలో ఆటో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో, రాజేశ్వరి భర్త అశోక్(32) ఆటో డ్రైవింగ్ చేశాడు. పోలిరెడ్డిపాలెం వద్ద బైపాస్, సర్వీస్ రోడ్డు మార్గాల మధ్య గందరగోళానికి గురైన అశోక్.. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మర్రిపూడి సుశీల(52) తల, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్ తో పాటు అశోక్, రాజేశ్వరిలకు సైతం గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు, 108 సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. Uploaded Video:

పల్నాడు

*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!*

*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!* *ప్రస్తుతమున్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.* *కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జడ్పీలు మంజూరు.* *అదనంగా 15 జడ్పీ CEO, 15 డిప్యూటీ CEO పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం.* *ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే అమల్లోకి రానున్న 28 కొత్త జడ్పీల వ్యవస్థ.*