వార్త ముఖ్యాంశాలు
- గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి చేరిస్తే కేంద్ర ప్రభుత్వ బహుమతి పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను గోల్డెన్ అవర్‌లోపు సమీప ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తుందని జిల్లా…
- రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 3న ప్రారంభించిన ‘రాహ్-వీర్’ పథకం రాష్ట్రంలో అమల్లో ఉందన్నారు.
- కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఎవరైనా ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.
గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులను ఆసుపత్రికి చేరిస్తే కేంద్ర ప్రభుత్వ బహుమతి
పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను గోల్డెన్ అవర్‌లోపు సమీప ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 3న ప్రారంభించిన ‘రాహ్-వీర్’ పథకం రాష్ట్రంలో అమల్లో ఉందన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ఎవరైనా ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. గతంలో రూ.5 వేలుగా ఉన్న ప్రోత్సాహకాన్ని రూ.25 వేలకు పెంచినట్లు వివరించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారిని అనవసరమైన పోలీసు విచారణలు, వేధింపులకు గురిచేయకుండా రక్షణ కల్పిస్తారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను చూసి భయపడకుండా మానవతా దృక్పథంతో స్పందించి క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో 108 లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్