డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి, అక్టోబర్ 15: కావలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సమాజ సేవకులు దివంగత డాక్టర్ ప్రభాకర్ నాయుడు అందించిన వైద్య, సామాజిక సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం కావలిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన డాక్టర్ ప్రభాకర్ నాయుడు సంతాప సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైద్యరంగంతో పాటు సామాజిక సేవలోనూ డాక్టర్ ప్రభాకర్ నాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే ఇతర నాయకులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కావలి ప్రాంతంలో వైద్యరంగానికి సంబంధించి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు డాక్టర్ ప్రభాకర్ నాయుడు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ మేరకు కావలిలో విగ్రహం ఏర్పాటుచేస్తామన్నారు. డాక్టర్ ప్రభాకర్ నాయుడు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సంతాప సభ నిర్వహిస్తామని, కావలి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు, డాక్టర్ ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.









