Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: politics

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పగలు బురద.. రాత్రి చీకటి!

ఐతంపాడులో అధ్వానంగా సీసీ రోడ్డు.. వీధి దీపాలు లేక గ్రామస్తుల అవస్థలు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఐతంపాడు గ్రామంలో రహదారి సమస్యలు, వీధి దీపాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రస్తుతం మట్టిరోడ్డును తలపిస్తుండగా, రాత్రి వేళల్లో వీధి దీపాలు లేక గ్రామస్తులు చీకట్లో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. పగలు బురదతో.. రాత్రి చీకటితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి బురదమయంగా సీసీ రోడ్డు! గ్రామంలో లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పోసిన మట్టి వర్షపు నీటికి కొట్టుకొచ్చి పేరుకుపోవడంతో పాటు, నీరు నిలిచిపోవడంతో రహదారి మొత్తం బురదమయంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శికి తెలిపినా ఫలితం శూన్యం! రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించి, రహదారిని శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శికి సమస్యను తెలియజేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వీధి దీపాలు లేక రాత్రివేళ ఇబ్బందులు గ్రామంలో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో గ్రామం చీకటిమయంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. చీకట్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం, గ్రామ నాయకులు సైతం స్పందించకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సంబంధించిన నిధులను నిబంధనల ప్రకారం వినియోగించి ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అధికారులు వెంటనే స్పందించాలి ఐతంపాడు గ్రామంలో రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అమర్చి రాత్రివేళల్లో వెలుగులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న మన్నెమాల సుకుమార్ రెడ్డి

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట లో కావలి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు, ఆలయ ఉభయకర్తలు, గ్రామ పెద్దలు మన్నెమాల సుకుమార్ రెడ్డి ఘనంగా సత్కరించారు,ఈ సందర్భంగా మన్నెమాల సుకుమార్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట భక్తిశ్రద్ధలతో, అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకల్లో మన్నెమాల సుకుమార్ రెడ్డి అనుచరులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. భక్తులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి, అక్టోబర్ 15: కావలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సమాజ సేవకులు దివంగత డాక్టర్ ప్రభాకర్ నాయుడు అందించిన వైద్య, సామాజిక సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం కావలిలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో నిర్వహించిన డాక్టర్ ప్రభాకర్ నాయుడు సంతాప సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైద్యరంగంతో పాటు సామాజిక సేవలోనూ డాక్టర్ ప్రభాకర్ నాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే ఇతర నాయకులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కావలి ప్రాంతంలో వైద్యరంగానికి సంబంధించి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు డాక్టర్ ప్రభాకర్ నాయుడు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ మేరకు కావలిలో విగ్రహం ఏర్పాటుచేస్తామన్నారు. డాక్టర్ ప్రభాకర్ నాయుడు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సంతాప సభ నిర్వహిస్తామని, కావలి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు, డాక్టర్ ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన వధూవరులను ఆశీర్వదించిన జనసేన కావలి అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు

నెల్లూరు జిల్లా, అల్లూరు గ్రామస్థులు గూపి నాగరాజు కుమారుడు నాగనవీన్ మరియు హిమజ లా వివాహ వేడుకలకు కావలి జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు హాజరయ్యారు. తలమంచిలో ఓ కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు..ఈ సందర్భంగా అక్కడి వారితో ఆయన ఆప్యాయంగా పలకరించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి జనసేన సమన్వయకర్త మన్నెమాల సుకుమార్‌ రెడ్డిని ఘనంగా సన్మానించిన 23వ వార్డు నాయకులు

నెల్లూరు జిల్లా, కావలి జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మన్నెమాల సుకుమార్ రెడ్డి గారిని కావలి పట్టణంలోని 23వ వార్డు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 23వ వార్డు ప్రముఖ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ వైస్ ప్రెసిడెంట్ దాసరి కిషోర్ కుమార్, వానంశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పలువురు జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు సుకుమార్ రెడ్డి గారి కార్యాలయంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సుకుమార్ రెడ్డి గారు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తామంతా ఆయన వెన్నంటే ఉండి పనిచేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దగదర్తి మండలం తురిమెర్ల స్మశానం వాటిక స్థలం ప్రహరీ గోడ LED లైట్లు శంకుస్థాపన

కావలి శాసనసభ్యులు దగుమాటివెంకటకృష్ణారెడ్డిఆదేశానుసారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సౌజన్యముతోదగదర్తి మండలం తురిమెర్ల గ్రామ పంచాయితీలో ముఖ్యఅతిధిగాదగదర్తి మండల ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి తురిమెర్ల గ్రామములో నుడా నిధులతో 40, 00,000/-లక్షల రూపాయలతో స్మశానం వాటిక స్థలం ప్రహరీ గోడ LED లైట్లు శంకుస్థాపన కార్యక్రమములో పాల్గొనడం జరిగింది. ఈకార్యక్రమంలో గున్నం రెడ్డి హరికిశోర్ రెడ్డి, అల్లం రాధయ్య గట్టల కొండయ్య మేకల శీనయ్య పందిళ్ల సుధాకర్ గోపాల్ చంద్ర ప్రతాప్ రాజా శర్మ సుమన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు మండలానికి చెందిన జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు షేక్ నూరిద్దీన్ మంగళవారం కావలిలో జనసేన పార్టీ ఎన్ని

నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు షేక్ నూరిద్దీన్ మంగళవారం కావలిలో జనసేన పార్టీ ఎన్నికల అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ​ఈ సందర్భంగా షేక్ నూరిద్దీన్… సుకుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికగా పెన్నును బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ​అనంతరం మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, పార్టీ బలోపేతంలోనూ అందరం ఐకమత్యంగా కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టమే పార్టీకి అసలైన బలమని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పోరాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు వున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన పార్టీని బలోపేతం చేద్దాంపార్టీ శ్రేణులకు మన్నెమాల సుకుమార్ రెడ్డి

కావలి: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని జనసేన నాయకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన్నెమాల సుకుమార్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.పార్టీని ఏకధాటిపై నడిపిస్తూ, సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. సీనియర్ నాయకుల అనుభవాన్ని, యువ కార్యకర్తల ఉత్సాహాన్ని సమన్వయం చేస్తూ, నిర్ణయాత్మక కమిటీలలో ఇరువర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని అభిప్రాయపడ్డారు. పార్టీ సభ్యత్వాల సంఖ్యను పెంచడంతో పాటు, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మన్నెమాల సుకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో ముందుకు సాగుతూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని మన్నెమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. పై కార్యక్రమంలో కొణిదల అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేనలోకి జన-జెడ్ యువత ప్రవాహం… పార్టీలోకి భారీగా చేరికలు

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం, చెన్నాయిపాలెం అరుంధతి వాడకు చెందిన యువత జనసేన పార్టీపై నమ్మకంతో ముందుకు కదిలింది. రావూరి మదన్మోహన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఉత్సాహభరితమైన జెన్-జి (Gen-Z) యువకులు జనసేన పార్టీలో చేరారు. ​స్థానిక జనసేన నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసుకుమార్ రెడ్డి గారు స్వయంగా యువకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ముందుకు వస్తున్న యువతతో జనసేన మరింత బలపడుతుందని సుకుమార్ రెడ్డి గారు,నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో జనసేన పార్టీలోకి భారీగా ముస్లిం మైనార్టీల చేరిక

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జనసేన పార్టీకి మైనార్టీ వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. కావలి పట్టణ జనసేన నాయకులు సయ్యద్ సాజిద్, షేక్ రిహానా, విజయానంద్ లా ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా ముస్లిం మైనార్టీ మహిళలు, యువత జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు పార్టీలో చేరిన మహిళలకు, యువతకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ​ఈ సందర్భంగా శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ: “జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, సమాజంలో మార్పు కోసం ఆయన పడుతున్న తపన చూసి అన్ని వర్గాల ప్రజలు పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు. ​కార్యక్రమ నిర్వాహకులు సయ్యద్ సాజిద్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై నమ్మకంతోనే మైనార్టీ మహిళలు, యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరారని, రాబోయే రోజుల్లో కావలి పట్టణంలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.