Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Political

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు సర్పంచ్ అభ్యర్థిగా పోతుంగుంట ప్రసాద్ నాయుడు నామినేషన్ దాఖలు

దుత్తలూరు. నందిపాడు Date:19-11-2026 దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోతుంగుంట ప్రసాద్ నాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, టీడీపీ దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, మండలం బీజేవైఎం అధ్యక్షులు పేమ్మసాని వేణుగోపాల్ తొ పాటు మండల టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు MPPగా రాజ్యలక్ష్మి

దుత్తలూరు ఎంపీపీ అభ్యర్థిగా మల్లంపాటి రాజ్యలక్ష్మి పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నర్రవాడ సెగ్మెంట్ ఎంపీటీసీగా ఆమె విజయం సాధించారు. మరికాసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులంతా కలిసి ఆమెను ఎంపీపీగా ఎన్నుకోనున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు లో వేడెక్కిన పంచాయతీ రాజకీయాలు!

నందిపాడు లో వేడెక్కిన పంచాయతీ రాజకీయాలు! (నందిపాడు ,12 నవంబర్ – పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలo నందిపాడు గ్రామ పంచాయతీ లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడoతో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై స్పష్టత రావడం తొ ఆశావహులు ఎదురుచూస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను బరిలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం: జనంలోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థులు

దుత్తలూరు: ఎన్నికల వేళ దుత్తలూరులో తెలుగుదేశం పార్టీ (TDP) ప్రచారం సరికొత్త ఊపు అందుకుంది. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి రాగానే వాటిని తుడిచిపెట్టే లక్ష్యంతో అభ్యర్థులు విస్తృతంగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. దుత్తలూరు జడ్పీటీసీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి, దుత్తలూరు బిట్ఎం 1 ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ కాకర్ల మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రచార పర్వం సాగింది. ఈ కార్యక్రమంలో నర్రావాడ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ గురవయ్య నాయుడు, మాజీ జడ్పీటీసీ శ్రీ మల్లికార్జున, సొసైటీ చైర్మన్ శ్రీ పెల్లాపూడి వెంకటరత్నం, మండల కన్వీనర్ శ్రీ ఉద్దండాల గురువారెడ్డి వంటి ముఖ్య నేతలు ప్రజల మధ్య నిలిచారు. అండగా ఉంటాం.. సమస్యలు తీరుస్తాం: గ్రామ వీధుల్లో పర్యటిస్తూ అభ్యర్థులు ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడి ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఈ పర్యటనకు స్థానిక ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల మధ్యలోకి టీడీపీ అభ్యర్థులు: గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ!

దుత్తలూరు: స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం party (TDP) శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. దుత్తలూరు జడ్పీటీసీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి, దుత్తలూరు బిట్ 1 ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ కాకర్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో నర్రావాడ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ గురవయ్య నాయుడు, మాజీ జడ్పీటీసీ శ్రీ మల్లికార్జున, సొసైటీ చైర్మన్ శ్రీ పెల్లాపూడి వెంకటరత్నం, మండల కన్వీనర్ శ్రీ ఉండేలా గురువారెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమను భారీ మెజారిటీతో గెలిపించాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నవంబర్ 5 పోరుకు దుత్తలూరు సిద్ధం: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాకర్ల ముమ్మర ప్రచారం!

దుత్తలూరు: నవంబర్ 5న జరగనున్న ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో దుత్తలూరు బిట్-1 పరిధిలో తెలుగుదేశం పార్టీ (TDP), కూటమి ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ కాకర్ల మధుసూదన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి కమ్మవారిపాలెం, ఏఏ కాలనీ, దుత్తలూరు, కట్టకిందపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీ కంభం విజయరామిరెడ్డి గారిని, తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు AA కాలనీలో MPTC అభ్యర్థి కాకర్ల మధుసూదన్ రెడ్డి ఉధృత ప్రచారం!

దుత్తలూరు: మండల పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుత్తలూరు బిట్-1 స్థాన కూటమి MPTC అభ్యర్థి శ్రీ కాకర్ల మధుసూదన్ రెడ్డి దుత్తలూరులోని AA కాలనీలో విస్తృతంగా పర్యటించారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్తూ స్థానిక ప్రజలను కలుస్తూ, సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, కాలనీ అభివృద్ధియే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, ప్రజాసేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెడ్డుపాడు సర్పంచ్ అభ్యర్థిగా బర్రె సలోమి

దుత్తలూరు మండలం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెడ్డుపాడు గ్రామ ఎస్సీ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా బర్రె సలోమి పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆమె సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఆమె ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో సర్పంచ్‌గా ఎన్నికైతే ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని బర్రె సలోమి పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు: టీడీపీలోకి వైసీపీ నాయకులు

వరికుంటపాడు (M) కృష్ణంరాజుపల్లికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు లో సర్పంచ్ రిజర్వేషన్స్ ఇవే…

దుత్తలూరులో సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే..! దుత్తలూరు మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. > జనరల్: నందిపాడు, రాచవారిపల్లి, వెంకటంపేట, ఏరుకొల్లు జనరల్ మహిళ: బండకిందపల్లి, బోడవారిపల్లి, బ్రహ్మేశ్వరం, కొత్తపేట, వెంగన్నపాలెం ఎస్సీ: రెడ్లదీన్నే, తిమ్మాపురం ఎస్సీ మహిళ: తెడ్డుపాడు బీసీ: భైరవరం, దుత్తలూరు, పాంపల్లి బీసీ మహిళ: నర్రవాడ, సోమలరేగడ