నిర్మల్‌లో సందడి చేసిన హీరోయిన్.. మాంగల్య షాపింగ్ మాల్‌లో ప్రత్యేక ఆకర్షణ
నిర్మల్, అక్టోబర్ 8, పున్నమి ప్రతినిధి: నిర్మల్ పట్టణంలో ప్రముఖ సినీ హీరోయిన్ సందడి చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి గురువారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాల్‌ను ప్రారంభించారు. హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులను ఉద్దేశించి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. దసరా పండుగను పురస్కరించుకుని మాంగల్య షాపింగ్ మాల్‌లో ప్రత్యేక “దసరా దీపాల ఆఫర్”ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. పండుగ సందర్భంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిర్మల్ పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.







