Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులకు అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

నిర్మల్: జిల్లాలో ఇటీవల నిర్వహించిన గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగియడంలో పోలీసుల కృషి అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నిర్మల్‌తో పాటు ఖానాపూర్, భైంసా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నూతన పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఘనంగా సన్మానించి, పోలీసుల సేవలను అభినందించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండుగ కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు.

గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులకు అభినందనలు

గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులకు అభినందనలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *