Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

ఆడెలి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గంగ నీళ్ల జాతరలో ప్రత్యేక పూజలు

గంగ నీళ్ల జాతరలో ప్రత్యేక పూజలు సారంగాపూర్, అక్టోబర్ 18: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెలి గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆడెలి మహాపోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతరలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో అల్లోల సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, ఆడెలి మాజీ చైర్మన్ ఆయిట చందు, శ్రీనివాస్, గంగారెడ్డి, రమణారెడ్డి. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

నిర్మల్

ఆడెలి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కూచాడి శ్రీహరి రావు

గంగ నీళ్ల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నేత సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెలి గ్రామంలో శ్రీ ఆడెలి మహాపోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గంగ నీళ్ల జాతరకు పలువురు భక్తులు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, నిర్మల్ గండిరామన్న ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

నిర్మల్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ఎం.ఏ. లతీఫ్ భేటీ హైదరాబాద్,

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో ఎం.ఏ. లతీఫ్ భేటీ హైదరాబాద్, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి): సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంచిర్యాల జిల్లా పరిశీలకులు, మైనారిటీ విభాగం అబ్జర్వర్ ఎం.ఏ. లతీఫ్ ఆదివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ప్రజాభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సచిన్ సావంత్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై ఈ భేటీలో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.

నిర్మల్

సేవాభావంతో వైద్య సేవలు అందించాలి జిల్లా గ్రంథాలయ చైర్మన్

ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించిన 30 మంది ముస్లిం విద్యార్థులకు సన్మానం నిర్మల్, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి): వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించిన విద్యార్థులు అభినందనీయులని ముఫ్తీ ఇలియాస్ ఖాస్మి అన్నారు. తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిధిలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన 30 మంది ముస్లిం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ మాట్లాడుతూ, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. దైవం తర్వాత వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని, వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకుని ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్‌తోనే ఆగిపోకుండా పీజీ విద్యలోనూ ప్రతిభ చాటి, నిష్ణాతులైన వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ తల్లిదండ్రులకు, సొంత గ్రామాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మతీన్, కార్యదర్శి వహీద్ ఖాన్, మొహమ్మద్ ఇంతియాజ్, అబ్దుల్ సాజిద్, ముజాహిద్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ బతుకమ్మ ఘాట్ దుస్థితిపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్యే విఫలం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలి: బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మార్గొండ రాము నిర్మల్, పున్నమి ప్రతినిధి అబ్దుల్ సాదిక్: నిర్మల్ పట్టణంలోని బతుకమ్మ ఘాట్ నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దసరా, శరన్నవరాత్రుల సందర్భంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడిన అనంతరం బతుకమ్మ, బొడ్డెమ్మలను నిమజ్జనం చేసేందుకు వచ్చే ఘాట్ ప్రస్తుతం అపరిశుభ్రంగా, అస్తవ్యస్తంగా మారిందని వారు విమర్శించారు. మహిళలు ఇబ్బందులు పడుతున్నా ఘాట్‌ను శుభ్రం చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బతుకమ్మ ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచలేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కనీస పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక నిధులు కేటాయించి, ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బతుకమ్మ ఘాట్‌ను శుభ్రం చేసి, మహిళలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వాల పనితీరును గమనించాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మార్గొండ రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు రమేష్, సుశీల్ కుమార్ రావు, మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి, మాజీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అక్రమ్ అలీ, మాజీ కమిటీ సభ్యుడు నజీర్ ఖాన్, పార్టీ సీనియర్ ఉద్యమ నాయకుడు శివాజీ, బీఆర్ఎస్వీ యువజన నాయకుడు సాయికుమార్ రావు, మైనార్టీ జిల్లా నాయకులు మహబూబ్, జుబేర్, నిర్మల్ పట్టణ మైనార్టీ నాయకులు మసూద్, నయీమ్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

సరస్వతీ కెనాల్ నీటితో నిండిన వడ్యాల్–రాచాపూర్ చెరువు

రైతుల విజ్ఞప్తికి స్పందన.. శ్రీహరి రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి ఫలితం నిర్మల్, పున్నమి ప్రతినిధి: లక్ష్మణ్ చందా మండలంలోని వడ్యాల్–రాచాపూర్ గ్రామాల మధ్య ఉన్న చెరువును సరస్వతీ కెనాల్ నీటితో నింపారు. పంటల సాగు, పశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసినట్లు మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషితోనే నీటి విడుదల సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ వీడీసీ సభ్యులు, సర్పంచులు సమన్వయంతో ముందుకు వచ్చి చెరువులను నీటితో నింపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్యాల్, రాచాపూర్, కనకాపూర్ సర్పంచులు నరేష్, వెంకట్ రాజు, మహేష్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నిర్మల్

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ!

ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలి కాంగ్రెస్ అధిష్ఠానానికి సీనియర్ నాయకుడు డాక్టర్ మహమ్మద్ షాహిద్ విజ్ఞప్తి ఆదిలాబాద్, పున్నమి ప్రతినిధి: భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంచిర్యాల జిల్లా పరిశీలకులు ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిజాం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ షాహిద్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎం.ఏ. లతీఫ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో సేవలందిస్తున్నారని, పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా ఉంటూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని షాహిద్ పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు, సముచిత అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడికి కేటాయించే అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలించాలని కోరారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న ఎం.ఏ. లతీఫ్‌కు ఈ పదవిని కేటాయించడం ద్వారా ఆయన సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని డాక్టర్ మహమ్మద్ షాహిద్ విజ్ఞప్తి చేశారు. Uploaded Video:

నిర్మల్

నిర్మల్‌లో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

రూ.12 కోట్లతో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్, అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజుల్ పెట్ 21వ వార్డులో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు కేటాయించినట్లు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించడం, పనులకు శ్రీకారం చుట్టడంతో స్థానికంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్యక్రమంలో అయ్యన్న, గారి భూమయ్య. మరియు జుమే రాత్రి పెట్ అశోక్. రాజేశ్వర్.చిన్న రాజేశ్వర్.శ్రీశైలం నాగరాజు. పవార్ కైలాస్పా. కిషన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, గాజులపేట్ వార్డు ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

నిర్మల్

మూల నక్షత్రం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అల్లోల దంపతులు

బాసర: పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన సతీమణి విజయలక్ష్మితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పీవీ రమణారెడ్డి, మేడారం ప్రదీప్, మలేష్, పాకాల రాంచందర్, పి. రమేష్ రెడ్డి, కొప్పుల శ్రీధర్, రవికిరణ్, రమేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

నిర్మల్

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న సయ్యద్ అర్జుమంద్ అలీ

నిర్మల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, కౌన్సిలర్లు నాందేడేపు చిన్ను, కత్తి నరేందర్, జింక సూరి, ధర్మాజీ శీను, షేక్ ఫిరోజ్, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు సాయి ప్రతాప్, నరేందర్, ప్రశాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.