నిర్మల్
మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్యే విఫలం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలి: బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మార్గొండ రాము నిర్మల్, పున్నమి ప్రతినిధి అబ్దుల్ సాదిక్: నిర్మల్ పట్టణంలోని బతుకమ్మ ఘాట్ నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దసరా, శరన్నవరాత్రుల సందర్భంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆడిన అనంతరం బతుకమ్మ, బొడ్డెమ్మలను నిమజ్జనం చేసేందుకు వచ్చే ఘాట్ ప్రస్తుతం అపరిశుభ్రంగా, అస్తవ్యస్తంగా మారిందని వారు విమర్శించారు. మహిళలు ఇబ్బందులు పడుతున్నా ఘాట్‌ను శుభ్రం చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బతుకమ్మ ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచలేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కనీస పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక నిధులు కేటాయించి, ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బతుకమ్మ ఘాట్‌ను శుభ్రం చేసి, మహిళలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వాల పనితీరును గమనించాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మార్గొండ రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు రమేష్, సుశీల్ కుమార్ రావు, మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి, మాజీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అక్రమ్ అలీ, మాజీ కమిటీ సభ్యుడు నజీర్ ఖాన్, పార్టీ సీనియర్ ఉద్యమ నాయకుడు శివాజీ, బీఆర్ఎస్వీ యువజన నాయకుడు సాయికుమార్ రావు, మైనార్టీ జిల్లా నాయకులు మహబూబ్, జుబేర్, నిర్మల్ పట్టణ మైనార్టీ నాయకులు మసూద్, నయీమ్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.