Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Nara Lokesh

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యువనేత నారా లోకేష్‌కు ఘనస్వాగతం

మంత్రి నారా లోకేష్‌కు నెల్లూరు రూరల్‌లో ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమై ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులతో రూరల్ ప్రాంతం జనసంద్రంగా మారేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకునే స్థాయిలో స్వాగత కార్యక్రమం నిర్వహించాలని కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నారా లోకేష్‌కు భారీ స్వాగతం పలకనున్నట్లు నేతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆధునిక హంగులతో ఆర్ఎస్ఆర్–డిఎస్ఆర్ పాఠశాలలు

నగరంలోని ఆర్ఎస్ఆర్, డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన కుమార్తె షరణితో కలిసి పనులను పరిశీలించి, ఈ నెల 15లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మూసివేసిన వీఆర్సీని ఆధునీకరించామని, నగరంలోని 15 ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని నారాయణ చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు. డిఎస్ఆర్ స్కూల్‌లో విద్యార్థులతో కలిసి బాస్కెట్‌బాల్ ఆడి మంత్రి సందడి చేశారు. కార్యక్రమంలో బీదా రవిచంద్ర, రూప్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: ఆర్కే రోజా

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. డీఎస్సీ, టెట్‌ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్‌ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టులను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ, ధైర్యముంటే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లోకేష్‌కు సవాల్‌ విసిరారు. ఆధారాలను బయటపెడతామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో 85 శాతం వైఎస్సార్‌, జగన్‌ హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. కరువు పరిస్థితులకు కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని ప్రజలను కోరారు.