Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: latest updates

ASIFABAD

నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్ నియామకం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన: రెబ్బెన మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా నారాయణపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గజ్జల సాయికుమార్‌ను నియమించారు. సీనియర్ కార్యకర్తగా గుర్తించి తనకు ఈ బాధ్యత అప్పగించిన జిల్లా, మండల కమిటీలకు గజ్జల సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ASIFABAD

వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని వినతి

రెబ్బెన: మండలంలోని వికలాంగులకు ప్రతి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరుతూ సోమవారం MPDOకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్ణాథం శివప్రసాద్, షేక్ తాజ్ మియా, భీమనపల్లి వెంకటేశం, దుర్గం హరిలాల్, MRPS నాయకులు ఇగురపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటా కేటాయించాలి: SCCWU-IFTU

గోలేటి టౌన్‌షిప్: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటాను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (SCCWU-IFTU) ఆధ్వర్యంలో గోలేటి టౌన్‌షిప్‌లోని సివిల్ కార్యాలయం వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా SCCWU-IFTU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం మాట్లాడుతూ.. గత సంవత్సరం సింగరేణి యాజమాన్యం పర్మినెంట్ కార్మికులకు 34 శాతం లాభాల వాటాను చెల్లించిందని, ఒక్కొక్కరికి రూ.1,96,000 లాభాల వాటా అందించిందని తెలిపారు. అయితే పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.5,500 మాత్రమే ఇచ్చిందని అన్నారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించడం వల్లే సంస్థకు లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఒక పర్మినెంట్ కార్మికుడికి చెల్లించే వేతనంతో పది మంది కాంట్రాక్టు కార్మికులను పనిచేయించుకోవచ్చని, వేతనాల్లో భారీ తేడా ఉందన్నారు. ఒక పర్మినెంట్ కార్మికుడి స్థానంలో పది మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. సింగరేణి యాజమాన్యానికి వచ్చే లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ, చెమట చుక్కలు దాగి ఉన్నాయని అన్నారు. కాబట్టి కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటాను పంచాలని SCCWU-IFTU డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. తిరుపతి, అరికిళ్ల పోశం, గోలేటి శీను, భీమేష్, వెంకటేష్, చందు, పోసుబాయ్, శంకరమ్మ, సావిత్రి, ఎన్. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

ASIFABAD

తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక

ఈ నెల 03.09.2026 నుంచి 07.09.2026 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయిలో జరగనున్న 45వ సబ్-జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోలేటి గ్రామానికి చెందిన సింగరేణి పాఠశాల విద్యార్థులు పుదరి సిరి, ఎం. కృష్ణ లోకనందులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, సెక్రటరీ ఎస్. తిరుపతి, జిల్లా ఒలింపిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. నారాయణ రెడ్డి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంయుక్త కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, సింగరేణి పాఠశాల హెడ్‌మాస్టర్ ఎం. రవితేజ, పీఈటీ కె. భాస్కర్, వి. మహేందర్, ఆర్.వి. రామకృష్ణ రెడ్డి, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి మల్లేశ్, కె. నరేష్, జి. శ్రీధర్, వి. సతీష్ అభినందించారు.