నారాయణపేట
మక్తల్, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, కున్సి గ్రామ అభివృద్ధికి కూడా పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఆదివారం మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి నివాసం వద్ద కున్సి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకులు మంత్రితో చర్చించారు. గ్రామంలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధి అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కున్సి గ్రామానికి సంబంధించి 💫 శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం నిర్మాణం, 💫 బస్‌స్టాప్ షెడ్ ఏర్పాటు, 💫 వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి కాలువలో మట్టి తొలగింపు, 💫 25 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి అభివృద్ధి పనులకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కున్సి గ్రామ అభివృద్ధికి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి కున్సి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. 🙏🎉ఈ కార్యక్రమంలో కృష్ణ మండల మాజీ అధ్యక్షుడు రాజప్ప గౌడ్, రామలింగప్ప మాస్టర్, బన్నప్ప సౌకరి, పి. సిద్ధప్ప మాస్టర్, పి. శరణప్ప గౌడ్, శానప్ప మాస్టర్, అన్వర్, నాగభూషణ్ బాడియల్, శరణ, బసవ, కె. నారాయణ, వెంకటేష్, ఎన్. శ్రీనివాసులు, టీ. సూరప్ప, పి. సురేష్, జి. శరణు, ఏ. శివకుమార్, ఈ. వెంకటేష్ గౌడ్, నరసింహస్వామి, ఉప్పరి చంద్రశేఖర్, యు. సోము, జి. లక్ష్మణ్, బి. నర్సప్ప, బి. అశోక్, ఈ. రాజు తదితరులు పాల్గొన్నారు.