Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Kunsi

నారాయణపేట

కున్సీ గేట్ వద్ద బస్సుల నిలుపుదలకు హామీ

కున్సీ గ్రామ గేట్ వద్ద కర్ణాటక రాష్ట్ర బస్సులను నిలిపేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. గత నెల 15న తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని కలిసి సమస్యను వివరించగా, యాదగిరి, గుల్బర్గా బస్ డిపో మేనేజర్లతో పాటు కర్ణాటక రవాణా శాఖ మంత్రితో మంత్రి శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా బస్సుల నిలుపుదలకు హామీ లభించడంతో కున్సీ గ్రామ ప్రజలు మంత్రి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామలింగప్ప, రాజప్ప గౌడ్, నల్లె శ్రీనివాసులు, కే. నారాయణ, ఎం.డి. అన్వర్, పి. సురేష్, పి. సిద్ధప్ప, పి. శరణప్ప గౌడ్, బి. శరణబసవ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

ఘనంగా హిందీ భాషా దినోత్సవం

కున్సీ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కున్సీలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల హిందీ భాషా ఉపాధ్యాయిని శ్రీమతి స్వాతి మేడంను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సంతోషి మేడం, ఉపాధ్యాయులు నరేందర్, ఉష, ఖాసీం అలీ, సౌమ్య, నర్సింహులు, సత్యనారాయణ రెడ్డి, గీత, ఆరీఫ్, నాగేష్, రాధిక, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

వివేకానంద స్ఫూర్తితో యువత దేశం, ధర్మం వైపు నడవాలి బీజేపీ కృష్ణ మండల అధ్యక్షుడు నల్లె నరసప్ప

కృష్ణ మండలం కుసుమూర్తి, తంగిడి గ్రామాల్లో బీజేవైఎం నూతన కమిటీలను మండల బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నరసప్ప హాజరై మాట్లాడుతూ, స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశం, ధర్మం కోసం పనిచేస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సచిన్ భట్, సీనియర్ నాయకులు శంకరయ్య శెట్టి, మరెప్ప, నాగేంద్ర, బూత్ అధ్యక్షులు పర్వత్ రెడ్డి, జెన్సీర్, సాయి, బన్న, రవి గౌడ్, నర్సింగా, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

కున్సి గ్రామ అభివృద్ధికి మంత్రి వాకిటి శ్రీహరి హామీలు

మక్తల్, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, కున్సి గ్రామ అభివృద్ధికి కూడా పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఆదివారం మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి నివాసం వద్ద కున్సి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకులు మంత్రితో చర్చించారు. గ్రామంలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధి అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కున్సి గ్రామానికి సంబంధించి 💫 శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం నిర్మాణం, 💫 బస్‌స్టాప్ షెడ్ ఏర్పాటు, 💫 వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి కాలువలో మట్టి తొలగింపు, 💫 25 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి అభివృద్ధి పనులకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కున్సి గ్రామ అభివృద్ధికి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి కున్సి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. 🙏🎉ఈ కార్యక్రమంలో కృష్ణ మండల మాజీ అధ్యక్షుడు రాజప్ప గౌడ్, రామలింగప్ప మాస్టర్, బన్నప్ప సౌకరి, పి. సిద్ధప్ప మాస్టర్, పి. శరణప్ప గౌడ్, శానప్ప మాస్టర్, అన్వర్, నాగభూషణ్ బాడియల్, శరణ, బసవ, కె. నారాయణ, వెంకటేష్, ఎన్. శ్రీనివాసులు, టీ. సూరప్ప, పి. సురేష్, జి. శరణు, ఏ. శివకుమార్, ఈ. వెంకటేష్ గౌడ్, నరసింహస్వామి, ఉప్పరి చంద్రశేఖర్, యు. సోము, జి. లక్ష్మణ్, బి. నర్సప్ప, బి. అశోక్, ఈ. రాజు తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

కున్సి రైతాంగానికి కరువు ముప్పు కాలువల్లోకి సాగునీరు విడుదల చేయాలని రైతుల విజ్ఞప్తి

కృష్ణ మండలం కున్సి గ్రామ రైతాంగానికి కరువు ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లో తేమ లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామానికి సాగునీరు అందించే పెద్ద కాలువలోనూ నీటి ప్రవాహం లేకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇటీవల సంగంబండ రిజర్వాయర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ, ఆ నీరు డ్యాం పరిసర ప్రాంతాల్లోని పొలాలకే పరిమితమైందని రైతులు చెబుతున్నారు. సమీప గ్రామాలకు నీరు చేరుతున్నప్పటికీ కున్సి గ్రామానికి మాత్రం సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే పంటలు ఎండబట్టే పరిస్థితికి చేరుకున్నాయని, కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి కున్సి రైతాంగాన్ని ఆదుకోవాలని నల్లే శ్రీనివాసులు కోరారు. కనీసం కాలువకు ఇరువైపులా ఉన్న పొలాలకు నీరు అందితే రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు.

నారాయణపేట

కున్సి రైల్వే బ్రిడ్జి వద్ద రహదారికి మరమ్మతులు

కృష్ణ మండలంలోని కున్సి గ్రామ సమీపంలో రాయచూర్–యాదగిరి ప్రధాన రహదారిపై కున్సి రైల్వే బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గత కొంతకాలంగా రహదారి దెబ్బతినడంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గమనించిన కున్సి గ్రామ సర్పంచ్ మేకలి సురేష్ స్పందించి రోడ్డుకు ఇరువైపులా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారి సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున గుంతలను పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ పనులను రామ్‌చందర్, జయప్ప గౌడ్, నాగిరెడ్డి, శంక్రప్ప, రామ్ భీమ్, చెన్నప్ప, గణేష్ తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు.