Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

కున్సి రైల్వే బ్రిడ్జి వద్ద రహదారికి మరమ్మతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కున్సి రైల్వే బ్రిడ్జి వద్ద రహదారికి మరమ్మతులు

వార్త ముఖ్యాంశాలు

  • కృష్ణ మండలంలోని కున్సి గ్రామ సమీపంలో రాయచూర్–యాదగిరి ప్రధాన రహదారిపై కున్సి రైల్వే బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.
  • గత కొంతకాలంగా రహదారి దెబ్బతినడంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • ఈ సమస్యను గమనించిన కున్సి గ్రామ సర్పంచ్ మేకలి సురేష్ స్పందించి రోడ్డుకు ఇరువైపులా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయించారు.

కృష్ణ మండలంలోని కున్సి గ్రామ సమీపంలో రాయచూర్–యాదగిరి ప్రధాన రహదారిపై కున్సి రైల్వే బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గత కొంతకాలంగా రహదారి దెబ్బతినడంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గమనించిన కున్సి గ్రామ సర్పంచ్ మేకలి సురేష్ స్పందించి రోడ్డుకు ఇరువైపులా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేయించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారి సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున గుంతలను పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
ఈ పనులను రామ్‌చందర్, జయప్ప గౌడ్, నాగిరెడ్డి, శంక్రప్ప, రామ్ భీమ్, చెన్నప్ప, గణేష్ తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *