Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Kakinada

కాకినాడ

కాకినాడ జిల్లా పోలీసులు చైన్ స్నాచింగ్ కేసుల ఛేదింపు.

జిల్లా పోలీస్ శాఖ చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవతో కాకినాడ ఇంచార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మరియు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో కాకినాడ జిల్లాలో మరియు కోనసీమ జిల్లాలో పలు చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 కేసులలో ₹40,00,000/- (అక్షరాల నలభై లక్షల రూపాయలు) విలువగల 280 గ్రాముల బంగారు గొలుసులను, ఒక మోటార్ సైకిల్‌ను రికవరీ చేసి కాకినాడ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు కాకినాడ జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా వివిధ ప్రదేశాలలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగలను పట్టుకుని చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, APPS గారి ప్రత్యేక పర్యవేక్షణలో కాకినాడ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ పి.వి. త్రినాథ్ మరియు కాకినాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ డి. హితన్య కృష్ణ, కాకినాడ IT CORE ఇన్‌స్పెక్టర్ డి. దుర్గా శేఖర్ రెడ్డి, క్రైమ్ ఎస్.ఐ.ఎస్. విల్లన్ బాబు, ఇంద్రపాలెం ఎస్.ఐ. ఎం. వీరబాబు గార్ల నేతృత్వంలో కాకినాడ క్రైమ్ పోలీసులు, కాకినాడ IT CORE సిబ్బంది, ఇంద్రపాలెం పోలీసులు సంయుక్తంగా కృషి చేసి, క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి, సాంకేతికత మరియు ఇతర దర్యాప్తు పద్ధతుల ద్వారా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

కాకినాడ

జేఎన్‌టీయూకే లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అక్టోబర్ 12, 2026న కాకినాడలోని జేఎన్‌టీయూ (జేఎన్‌టీయూకే)లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 ప్రాంతీయ సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమం & సమావేశంలోని ముఖ్యాంశాలు • పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు: ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి ప్రాంతం కోసం ₹6,200 కోట్ల విలువైన ప్రధాన పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేసింది. వీటి ద్వారా సుమారు 18,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. • కీలక ప్రాజెక్టుల ప్రకటన: • నెక్సాన్-జియోకెమ్ గ్రూప్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ ప్లాంట్ (₹1,250 కోట్ల పెట్టుబడితో, 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో). • కాకినాడ యాంకరేజ్ పోర్ట్ సమీపంలో ఎస్ఏఎఫ్ వన్ ఎనర్జీ గ్రూప్ ద్వారా ఒక ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్. • సముద్ర మత్స్య సలహాలు మరియు సునామీ హెచ్చరికల కోసం ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) యొక్క కొత్త శాఖ. • పవన్ కళ్యాణ్ ప్రసంగం: స్థానిక తీరప్రాంతం, మడ అడవులు, భూమిని పరిరక్షిస్తూ, స్వచ్ఛమైన సాంకేతికత, సుస్థిర వృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను, సాంకేతికతను తీసుకురావాలని ఆయన కోరారు.

కాకినాడ

ఆశా వర్కర్లు సమస్యలను పరిష్కరించాలి – CITU ఆధ్వర్యంలో కాకినాడ సిటీ MLA శ్రీ వనమాడి కొండబాబు కి వినతిపత్రం

కాకినాడలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు వినతిపత్రం అందజేసి, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సహకరించాలని యూనియన్ ప్రతినిధులు కోరారు.

కాకినాడ

కాకినాడ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో స్త్రీలకు ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ వైద్య శిబిరం

స్త్రీలకు ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ వైద్య శిబిరం జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసోత్సవం సందర్భంగా కాకినాడ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో, రాజమండ్రి GSL మెడికల్ కాలేజీ వారి సౌజన్యంతో మహిళలకు ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో భాగంగా ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, రొమ్ము స్కానింగ్, మేమోగ్రఫీ సేవలు అందించనున్నారు. ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. క్యాన్సర్ గురించి భయపడకుండా, ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం 2026 అక్టోబర్ 10వ తేదీ శనివారం కాకినాడలోని NFCL రోడ్‌లో ఉన్న Dr. B.S. Rao Memorial IMA Hallలో నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతుంది. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాకినాడ

ఈ నెల 16వ తేదీన పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో నిర్వహించనున్న “జాబ్ మేళా”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో నిర్వహించనున్న “జాబ్ మేళా”పోస్టర్‌ను ఆవిష్కరించిన కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేయడం, వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొండబాబు గారు ఆకాంక్షించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటి వరకు అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు పొందారని, వారికి కలిగిన నైపుణ్యం , అర్హత ఆధారంగా మంచి జీతం పొందవచ్చు అని APSSDC సంస్థ వారు తెలియచేశారు.

కాకినాడ

సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ఆపరేషన్ త్రిశూల్’,కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐ

ఆపరేషన్ త్రిశూల్‌” కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్. సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ స్వయంగా పాల్గొని విద్యార్థులకు కీలకమైన సామాజిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు స్వయంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ త్రిశూల్‌ లో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఇటీవల చేపట్టిన “రైజ్ ఎగైనెస్ట్ గాంజా”లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఇస్తే తగిన బహుమతి ఇస్తామని, అలాంటి సమాచారం ఉంటే 1972 హెల్ప్‌లైన్ నంబర్‌కు తెలియజేయాలని పిలుపునిచ్చారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని మరియు అతివేగం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం వంటి నిర్లక్ష్య స్వభావాన్ని వీడాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం తీవ్రమైన నేరమని, ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణ రక్షణ కోసమేనని వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులు, ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, పిన్, OTP వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని, సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని చెప్పారు. అలాగే అనధికారిక లోన్ యాప్‌ల ఉచ్చులో పడకూడదని మరియు మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. వేధింపులకు గురైతే భయపడకుండా 112 అత్యవసర నంబర్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కాకినాడ

కాకినాడలో ఎంపీ ఇంటికి స్కీం వర్కర్ల ర్యాలీ

**కాకినాడ:** అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి **కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని** డిమాండ్ చేస్తూ స్కీం వర్కర్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. నాగమల్లితోట జంక్షన్ నుంచి ర్యాలీగా ఎంపీ ఇంటికి చేరుకున్న కార్మికులు తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎంపీ అనుచరులకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీం వర్కర్ల వేతనాలను పెంచాలని, సమస్యలు పరిష్కరించకపోతే **డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో ఆందోళన చేపడతామని** సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. Uploaded Video:

కాకినాడ

మహాత్మా గాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించు కుని శుక్రవారం కలెక్టరేట్‌ లో నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్ ..

మహాత్మా గాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించు కుని శుక్రవారం కలెక్టరేట్‌ లో నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్ .. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి,మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.*

కాకినాడ

నేడు గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

నేడు గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గారు, KUDA చైర్మన్ శ్రీ తలాటం సత్య గారు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములవుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

కాకినాడ

“చిన్నతనంలో నడక నేర్పిన పెద్దలకు, వృద్ధాప్యంలో తోడుగా నిలవడమే మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం.”.డా అడ్డాల

స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ వృద్దాశ్రమం లో శ్రీ సత్య దంత వైద్యశాల వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యాన వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు, ఈ సందర్భంగా డా అడ్డాల మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 1990 డిసెంబర్ 14న ఆమోదించిన తీర్మానం ప్రకారం, 1991 అక్టోబర్ 1 నుంచి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ప్రారంభించారని, సమాజం, కుటుంబం మరియు దేశ ప్రగతిలో వయోవృద్ధులు అందించిన సేవలను స్మరించుకోవడం, వృద్ధాప్యంలో ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక మరియు సామాజిక సమస్యల పట్ల సమాజంలో చైతన్యం తీసుకురావడం, వారిని నిర్లక్ష్యం చేయకుండా, హింస లేదా వివక్షకు గురికాకుండా చూసుకోవడం మరియు వారి ప్రాథమిక హక్కులను కాపాడడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు, రోజువారీ జీవితంలో వృద్ధులతో సమయం గడపడం, వారి మాటలను శ్రద్ధగా వినడం. అనుభవాన్ని ఉపయోగించుకోవడం,వారి వద్ద ఉన్న జీవిత అనుభవం మరియు జ్ఞానాన్ని తర్వాతి తరాలకు మార్గదర్శకంగా ఉపయోగించడం చేయాలని, వారి ఆహారం, మందులు మరియు మానసిక ఉల్లాసం పట్ల క్రమం తప్పకుండా శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ చరణ్, వీరభద్ర రావు, ఆశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు.