కాకినాడ జిల్లా పోలీసులు చైన్ స్నాచింగ్ కేసుల ఛేదింపు.
జిల్లా పోలీస్ శాఖ చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవతో కాకినాడ ఇంచార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మరియు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో కాకినాడ జిల్లాలో మరియు కోనసీమ జిల్లాలో పలు చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 కేసులలో ₹40,00,000/- (అక్షరాల నలభై లక్షల రూపాయలు) విలువగల 280 గ్రాముల బంగారు గొలుసులను, ఒక మోటార్ సైకిల్ను రికవరీ చేసి కాకినాడ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు కాకినాడ జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా వివిధ ప్రదేశాలలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగలను పట్టుకుని చైన్ స్నాచింగ్లను అరికట్టేందుకు ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, APPS గారి ప్రత్యేక పర్యవేక్షణలో కాకినాడ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.వి. త్రినాథ్ మరియు కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డి. హితన్య కృష్ణ, కాకినాడ IT CORE ఇన్స్పెక్టర్ డి. దుర్గా శేఖర్ రెడ్డి, క్రైమ్ ఎస్.ఐ.ఎస్. విల్లన్ బాబు, ఇంద్రపాలెం ఎస్.ఐ. ఎం. వీరబాబు గార్ల నేతృత్వంలో కాకినాడ క్రైమ్ పోలీసులు, కాకినాడ IT CORE సిబ్బంది, ఇంద్రపాలెం పోలీసులు సంయుక్తంగా కృషి చేసి, క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి, సాంకేతికత మరియు ఇతర దర్యాప్తు పద్ధతుల ద్వారా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.









