Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Farmer ID

గుంటూరు

ఫార్మర్ ఐడీ లేకుంటే పథకాలకు ఆటంకం

ప్రతి రైతు తప్పనిసరిగా 11 అంకెల ఫార్మర్ ఐడీ పొందాలని గుంటూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు సూచించారు. పెదకాకాని మండలం ఉప్పలపాడులో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఆధార్‌లాగే రైతులకు ఫార్మర్ ఐడీ కీలకమని, భవిష్యత్తులో ధాన్యం కొనుగోలు, పీఎం కిసాన్ వంటి వ్యవసాయ సేవలు దీనితో అనుసంధానమయ్యే అవకాశం ఉందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఐడీ పొందాలని కోరారు. ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగం, వరి తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. ఈ-క్రాప్ నమోదు 95 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు.

గుంటూరు

పంట వేయని రైతులకు సబ్సిడీ విత్తనాలు

ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు పంటలు వేయని రైతులకు స్వల్పకాలిక అపరాల విత్తనాలైన మినుములు, పెసలు, కంది విత్తనాలను సబ్సిడీపై అందించనున్నట్లు గుంటూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు తెలిపారు. వట్టిచెరుకూరులో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి విత్తనాలు పొందాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్‌ ఐడీ కలిగి ఉండటంతో పాటు ఈ-క్రాప్‌ బుకింగ్‌, ఈ-కేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. ఎరువులను శాస్త్రవేత్తల సూచన మేరకే వినియోగించాలని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో యూరియా, డీఏపీ నిల్వలను అధికారులు పరిశీలించారు.